Wednesday, March 18, 2026
Homeస్పోర్ట్స్Eng Vs NZ:  న్యూజిలాండ్ ఫాలోఆన్

Eng Vs NZ:  న్యూజిలాండ్ ఫాలోఆన్

ఇంగ్లాండ్ తో స్వదేశంలో జరుగుతోన్న రెండో టెస్టులో న్యూజిలాండ్ ఫాలోఆన్ ఆడుతోంది. ఏడు వికెట్లకు 138 పరుగులకు వద్ద నేడు మూడోరోజు ఆట మొదలు పెట్టిన కివీస్ తొలి ఇన్నింగ్స్ లో 209 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ సౌతీ 73 పరుగులతో రాణించాడు.

ఇంగ్లాండ్ బౌలర్లలో స్టువార్ట్ బ్రాడ్ నాలుగు, జేమ్స్ ఆండర్సన్, జాక్ లీచ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ కంటే 224 పరుగులు వెనకబడి ఫాలో ఆన్ మొదలు పెట్టింది కివీస్ జట్టు. రెండో ఇన్నింగ్స్ లో మూడోరోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. ఓపెనర్లు టామ్ లాథమ్- డెవాన్ కాన్వే లు తొలి వికెట్ కు 149 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.  కాన్వే 61; లాథమ్ 83 పరుగులు చేసి ఔటయ్యారు. విల్ యంగ్ 8 పరుగులకే పెవిలియన్ చేరాడు. కేన్ విలియమ్సన్-25;  హెన్రీ నికోలస్ – 18పరుగులతో క్రీజులో ఉన్నారు. కివీస్ ఇంకా 24 పరుగులు వెనకబడి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular