శ్రీలంక- న్యూ జిలాండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య జరుగుతోన్న టి 20 సిరీస్ ను కివీస్ కైవసం చేసుకుంది. కొలంబోలోని సారా ఓవల్ మైదానంలో జరిగిన నేటి మ్యాచ్ లో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి మరో మ్యాచ్ మ్గిగిలి ఉండగానే సిరీస్ గెల్చుకుంది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 118 పరుగులు చేయగా, కివీస్ 18.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసి లక్ష్యం చేరుకుంది.
శ్రీలంక 14 పరుగులకే మూడు వికెట్లు (విష్మి గుణరత్నే-7; ఆటపట్టు-2; కవిష దిల్హారి- డకౌట్) కోల్పోయింది. హాసిని పెరీరా-33; హర్షిత మాధవి-23; నీలాక్షి డిసిల్వా-22; అనుష్క సంజీవని-18 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో తహుహు 4; ఈడెన్ కార్సెన్-1 వికెట్ పడగొట్టారు.
లక్ష్య చేదనలో కివీస్ తొలి వికెట్ కు 48 రన్స్ చేసింది. బెర్నడిన్ 24; సుజీ బేట్స్-52 పరుగులు చేసి ఔటయ్యారు. మెలీ కేర్ర్ 33; సోఫీ డివైన్ 5 రన్స్ తో నాటౌట్ గా నిలిచారు. లంక బౌలర్లలో కవిష దిల్హారీ, రణవీర చెరో వికెట్ పడగొట్టారు.
కివీస్ బౌలర్ లియా తహుహు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ అందుకుంది.
మూడు వన్డేల సిరీస్ ను లంక 2-1తో గెల్చుకుంది.
చివరి టి 20 మ్యాచ్ బుధవారం జరగనుంది.