వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూ.టి.సి.) ఫైనల్ మ్యాచ్ లో ఇండియా తోలి ఇన్నింగ్స్ లో 217 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మొదటిరోజు ఆట ముగిసే సమయానికి కోహ్లి 44, రేహానే 28 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండోరోజు అదనంగా ఒక్క పరుగు చేయకుండానే కోహ్లి పెవిలియన్ చేరాడు. రెహానే అర్ధ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఔటయ్యాడు. టాపార్డర్ బాట్స్ మాన్ లో రిషభ్ పంత్ ఒక్క ఫోర్ తోనే సరిపెట్టాడు.
గత కొంత కాలంగా ఆల్ రౌండర్ ప్రతిభ చూపిస్తున్న రవిచంద్రన్ అశ్విన్(22), రవీంద్ర జడేజా(15) రెండంకెల స్కోరు సాధించ గలిగారు. ఇషాంత్ శర్మ, షమీ చెరో నాలుగు పరుగులు మాత్రమే చేయగలిగారు. బుమ్రా డకౌట్ అయ్యాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమ్సన్ ఐదు వికెట్లు సాధించాడు. వాగ్నర్, బోల్ట్ చెరో రెండు, సౌతీ ఒక వికెట్ సాధించారు.
టా మ్ లాథమ్, కాన్వేలు న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించారు.