Sunday, January 19, 2025
HomeTrending Newsదక్షిణాదిలో ఐసీస్ సానుభూతిపరులు...ఎన్ఐఏ దాడులు

దక్షిణాదిలో ఐసీస్ సానుభూతిపరులు…ఎన్ఐఏ దాడులు

దక్షిణాదిలోని మూడు రాష్ట్రాల్లోని ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల ఇళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) దాడులు చేస్తున్నది. ఈ రోజు (బుధవారం) తెల్లవారుజామున కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని 60 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నది. గతేడాది ఏడాది కోయంబత్తూర్, మంగళూరు నగరాల్లో జరిగిన పేలుళ్ల నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల ఇండ్లలో సోదాలు చేస్తున్నారు.

తమిళనాడులోని కోయంబత్తూర్‌లో సిలిండర్‌ పేలుడులో జమీజా ముబీన్ మరణించడంతో అతనితో సంబంధాలున్న వారిని ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. కర్ణాటకలోని మంగళూరులో ఆటోరిక్షా పేలుడు ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ఈ రెండు పేలుడు ఘటనలు ఉగ్రవాదులు చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. గతేడాది అక్టోబర్‌ 23న కోయంబత్తూరులోని కొట్టే సంగమేశ్వర ఆలయం ముందు స్పీడ్‌ బ్రేకర్‌ దగ్గరకు రాగానే మారుతి కారులో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముబీన్‌ చనిపోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీపావళి మందు ఈ పేలుడు జరగడంతో ఏదో కుట్ర దాగుందని అనుమానాలు నెలకొన్నాయి. దీంతో తమిళనాడు పోలీసులు ఈ కేసును ఎన్‌ఐఏకి అప్పగించింది. కాగా, పేలుడుకు పలు రసాయనాలు వాడినట్లు పోలీసులు గుర్తించారు. అంతని ఇంట్లో పొటాషియం నైట్రేట్‌, అల్యూమినియం పౌడర్‌, బొగ్గు, సల్ఫర్‌, నాటుబాంబుల తయారీకి వినియోగించే పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ముబీన్‌ను ఎన్‌ఐఏ 2019లో విచారించింది.

కోయంబత్తూర్‌ సిటీలో ఉగ్రవాద దాడులు జరిగాయి. 1998, ఫిబ్రవరి 14న మొత్తం 11 ప్రాంతాల్లో 12 పేలుళ్లు సంభవించాయి. ఈఘటనలో 58 మంది మరణించగా, 200 మంది గాయపడ్డారు. బీజేపీ అగ్రనేత, దివంగత ఎల్కే అద్వానీని టార్గెట్‌ చేస్తూ ఈ దాడులకు పాల్పడ్డారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్