Friday, March 20, 2026
Homeసినిమానిధి అగర్వాల్  ఇంత నిదానమైతే కష్టమే!

నిధి అగర్వాల్  ఇంత నిదానమైతే కష్టమే!

Nidhi Going slow: తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో పరిచయమైన అందమైన కథానాయికలలో నిధి అగర్వాల్ ఒకరు. చక్కని కనుముక్కు  తీరుతో ఆమె ఇట్టే ఆకట్టుకుంటుంది. కుదురైన రూపంలోనే అందాలన్నీ అందంగా కుదురుకున్నట్టుగా అనిపిస్తుంది. చేసింది చాలా తక్కువ సినిమాలు .. అందుకున్నది ఒకటి రెండు హిట్లు. అయినా ఆమెకి యూత్ లో ఒక రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. అందుకు కారణం ఆమె అందచందాలే. అప్సరసలకు దగ్గరగా కనిపించే పోలికలే. అందువల్లనే ఆమెను వెతుక్కుంటూ అవకాశాలు వస్తున్నాయి.

‘సవ్యసాచి’ సినిమాతో పరిచయమైన ఈ బ్యూటీ, ఆ వెంటనే అఖిల్ సరసన ‘మిస్టర్ మజ్ను’ సినిమా చేసింది. ఈ రెండు సినిమాల్లోనూ అమ్మడి అందాల ధాటిని తట్టుకోలేక కుర్రాళ్లు అల్లాడిపోయారు. కాకపోతే కథాకథనాల కారణంగా ఆ సినిమాలను కాపాడటం కష్టమైపోయింది. ఆ తరువాత చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ఆమె అందాలకీ .. అవి చేసిన సందడికి తగిన ఫలితాన్ని ముట్టజెప్పాయి. ఈ సినిమా తరువాత ఈ సుందరి ఇక్కడ జోరు చూపించడం ఖాయమనుకుంటే , కామ్ గా కోలీవుడ్ వెళ్లి అక్కడ ‘మమ’ అన్నట్టుగా ఒకటి రెండు సినిమాలు  చేసేసి వచ్చేసింది.

ఈ మధ్యనే అశోక్ గల్లా జోడీగా ‘హీరో’ సినిమా చేసింది. ఆమె ఆ సినిమా భారీ పారితోషికం కోసమే చేసిందనే  టాక్ వినిపించింది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘హరి హర వీరమల్లు’ సినిమా మాత్రమే ఉంది. ఆ తరువాత ఏ ప్రాజెక్టులోను ఆమె పేరు వినిపించడం లేదు .. కనిపించడం లేదు. ఆమె కంటే వెనుక వచ్చిన కుర్ర హీరోయిన్లు వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టేస్తున్నారు. అదే మాట అడిగితే .. నాలుగు కాలాలు నిలబడే సినిమాలు చేయాలనుకుంటున్నానని నిధి సమాధానమిస్తోంది. నాలుగు కాలాలపాటు నిలబడే సినిమాలు చేయాలనే అంతా అనుకుంటారు. కానీ అందుకోసం నాలుగు కాలాల పాటు వెయిట్ చేయడకూడదనే విషయం ఈ అమ్మాయికి ఎప్పుడు అర్థమవుతుందో .. ఏమో!

Also Read : నభా నటేశ్ ఏమైపోయిందబ్బా?!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular