Sunday, January 19, 2025
Homeసినిమాఅందగత్తెల రేసులోకి అడుగుపెట్టని నిధి అగర్వాల్!

అందగత్తెల రేసులోకి అడుగుపెట్టని నిధి అగర్వాల్!

నిధి అగర్వాల్ .. చూడాగానే అందాల చందమామకు చక్కని కనుముక్కుతీరు తీర్చిదిద్దినట్టుగా  కనిపిస్తుంది. పేరుకి తగినట్టుగానే అందాల నిధి అనిపిస్తుంది. ఈ అమ్మాయికి అభినయం తెలియకపోయినా ఫరవాలేదు .. అభిమానులుగా మేము ఉంటాము అని కుర్రాళ్లంతా ముక్త కంఠంతో చెప్పేశారు. బాలీవుడ్ స్క్రీన్ పై సందడి చేయవలసిన బ్యూటీ టాలీవుడ్ వైపు చూడటమే అదృష్టం అనుకున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ తప్ప మరో హిట్ లేకపోయినా మేకర్స్ కూడా అవకాశాలు ఇచ్చారు.

అయినా నిధి లైట్ తీసుకుని కోలీవుడ్ సినిమాల దిశగా వెళ్లింది. పోనీ ఆక్కడేమైనా హిట్లు కొట్టిందా అంటే అదీ లేదు. ఆ తరువాత తెలుగులో మంచి ప్రాజెక్టును సెట్ చేసుకోగలిగిందా అంటే అలాంటిదేం కనిపించడం లేదు. ఇతర భాషల్లో బిజీగా ఉండటం వలన, తెలుగును నిర్లక్ష్యం చేస్తుందా అనుకుంటే, ఏ భాషలో ఏ సినిమా చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్నది పవన్ కల్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సినిమా మాత్రమే. అది ఎప్పుడు పూర్తవుతుందన్నది ఎవరికీ తెలియదు.

నిధి అగర్వాల్ కంటే చాలా వెనుక వచ్చిన అమ్మాయిలు హీరోయిన్స్ గా మంచి మార్కులు కొట్టేయడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సక్సెస్ ను అందుకోవడానికి గట్టి కసరత్తు చేస్తున్నారు. స్టార్ డమ్ తెచ్చుకోవటానికి ట్రై చేస్తున్నారు. ఇక ఈ ఏడాది తెలుగు తెరకి పరిచయం కానున్న కొత్త హీరోయిన్స్  సంఖ్య  కూడా ఎక్కువగానే ఉంది. అయినా నిధి అగర్వాల్ మాత్రం ఈ రేసులో అడుగుపెట్టకుండా నింపాదిగానే ఉంది. అందం ఉన్నప్పటికీ ఇక్కడ అదృష్టం కోసం వెతుక్కోవాలి. కాస్త లౌక్యం కూడా వంటబట్టించుకోవాలి. మరి ఈ బ్యూటీకి అమాయకత్వం ఎక్కువా? ఆత్మవిశ్వాసం ఎక్కువా? అనేదే అభిమానులకు అర్థం కావడం లేదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్