Saturday, March 14, 2026
HomeTrending Newsనైజీరియాలో అమానుషం.. బందిపోట్లకి చిక్కిన 19మంది

నైజీరియాలో అమానుషం.. బందిపోట్లకి చిక్కిన 19మంది

నైజీరియాలోని ఓ మసీదులో దుండగులు జరిపిన కాల్పుల్లో చనిపోయిన వారి సంఖ్య 14కు చేరుకోగా బందీలుగా ఉన్న వారు మొత్తం 19 మంది అని తేలింది. మృతుల్లో మసీదు ఇమామ్‌ కూడా ఉన్నాడు. బంధీలను విడిచిపెట్టేందుకు డబ్బు డిమాండ్‌ చేసినట్లు తెలుస్తున్నది. మసీదులోకి వచ్చీరావడతో విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

నైజీరియాలోని ఫంతువా ప్రాంతంలోని మిగమ్‌జీ మసీదులో ప్రజలు నమాజ్‌ చేస్తున్నారు. ఇంతలో మసీదులోకి పరిగెత్తుకు వచ్చిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఇమామ్‌తో పాటు 12 మంది చనిపోయారు. ఆ తర్వాత మరో ఇద్దరు చనిపోయారు. దాడికి పాల్పడింది ఒక ముఠాగా అక్కడి పోలీసులు అనుమానిస్తున్నారు. బంధీలుగా ఉన్న వారిని విడిచేందుకు బందిపోట్ల డబ్బు డిమాండ్‌ చేసినట్లుగా తెలుస్తున్నది. ఇదే సమయంలో వ్యవసాయం చేయడానికి అనుమతి తీసుకోవాలని, రక్షణ పొందడం కోసం కూడా రుసుము చెల్లించాలని దుండగులు చెప్పినట్లుగా స్థానిక పోలీసులు పేర్కొంటున్నారు.

ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మోటర్‌ బైకులపై వచ్చిన దుండగులు మిగమ్‌జీ మసీదుకు చేరుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ప్రజలు భయాందోళనకు గురై ప్రాణాలను రక్షించుకోవడానికి తలో దిక్కు పరిగెత్తారు. కాల్పులు జరిపిన తర్వాత కొంతమందిని ఎత్తుకుని పొదల్లోకి తీసుకెళ్లారు. మసీదులో దుండగుల కాల్పులను నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్‌ బుహారీ తీవ్రంగా ఖండించారు. ద్వేషపూరిత ఆలోచనలు ఉన్నవారే ఇలాంటి నీచానికి దిగి ప్రజలను చంపేశారని అన్నారు. ఇలాంటి ద్వేషపూరిత వ్యక్తుల ముందు దేశం ఎన్నటికీ తలవంచదని ఆయన పేర్కొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular