Tuesday, June 16, 2026
HomeTrending Newsనిఖత్ జరీన్, ఇషాసింగ్‌ లకు కవిత అభినందనలు

నిఖత్ జరీన్, ఇషాసింగ్‌ లకు కవిత అభినందనలు

జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారిణిలు నిఖత్ జరీన్, ఇషా సింగ్‌ లను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. హైదరాబాద్ లోని నివాసంలో నిఖత్ జరీన్, ఇషా సింగ్‌ లు ఎమ్మెల్సీ కవితను కలిసారు.

జాతీయ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో తెలంగాణ తేజం నిఖత్ జరీన్ బంగారు పతకం గెలుపొందడం ,జాతీయ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్‌ రజత పతకం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వీరిద్దరి విజయాలు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular