Monday, March 16, 2026
Homeస్పోర్ట్స్CWG-2022: Boxing : సెమీస్ లో నిఖత్ జరీన్

CWG-2022: Boxing : సెమీస్ లో నిఖత్ జరీన్

కామన్ వెల్త్ గేమ్స్ లో ముగ్గురు భారత బాక్సర్లు సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టారు. మహిళల 50 కిలోల లైట్ ఫ్లై వెయిట్ విభాగం నుంచి తెలంగాణా క్రీడాకారిణి  నిఖత్ జరీన్ నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో వేల్స్ కు చెందిన హెలెన్ జోన్స్ పై 5-0ను ఓడించి సెమీస్ లో అడుగు పెట్టింది. 48కిలోల మినిమమ్ వెయిట్ విభాగంలో నితు ఘంఘస్ ప్రత్యర్థి, ఉత్తర ఐర్లాండ్ క్రీడాకారిణి నికోల్ క్లైడ్ వైదొలిగింది. దీంతో నితు సెమీస్ చేరింది.

మరోవైపు, పురుషుల 57కిలోల ఫెదర్ వెయిట్ విభాగంలో నమీబియాకు చెందిన ట్రయాగిన్ ను ఓడించి మన క్రీడాకారుడు, 2018 ఒలింపిక్స్ లో కాంస్య పతక విజేత మహమ్మద్ హుసాముద్దీన్ విజయం సాధించి సెమీస్ లో అడుగు పెట్టాడు.

తెలంగాణ తేజం నిఖత్ సెమీస్ లో శనివారం జరిగే మ్యాచ్ లో ఇంగ్లాండ్  క్రీడాకారిణి స్టబ్లీ తో తలపడనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular