Wednesday, March 12, 2025
Homeస్పోర్ట్స్Nikhat Zareen : నిఖత్ జరీన్ కు సాదర స్వాగతం

Nikhat Zareen : నిఖత్ జరీన్ కు సాదర స్వాగతం

ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ (ఐబిఏ) ఆధ్వర్యంలో గత వారం ఢిల్లీలో  ముగిసిన ప్జరపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్స్ 50కిలోల విభాగంలో తెలంగాణ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్  విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.  ఈ విజయం తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన  నిఖత్ కు శంషాబాద్ వినామాశ్రయంలో  రాష్ట్ర క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఘన స్వాగతం పలికారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, క్రీడాకారులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ E. ఆంజనేయ గౌడ్, రాష్ట్ర ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వేణు గోపాల చారి, రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు చాముండేశ్వరి నాథ్, రాష్ట్ర క్రీడ ప్రాధికార సంస్థ ఉన్నతాధికారులు ధనలక్ష్మి, సుజాత, చంద్రా రెడ్డి, డాక్టర్ హరికృష్ణ, సుధాకర్, వివిధ క్రీడా అసోసియేషన్ ప్రతినిధులుకూడా స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

Also Read :Nikhat Zareen: గర్వించదగ్గ బిడ్డ నిఖత్ జరీన్ కేసీఆర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్