Sunday, November 24, 2024
Homeస్పోర్ట్స్Boxing: నిఖత్, లవ్లీనాలకు గోల్డ్ మెడల్స్

Boxing: నిఖత్, లవ్లీనాలకు గోల్డ్ మెడల్స్

ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ (ఐబిఏ) ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతోన్న ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్స్ ­2023  ఫైనల్స్ లో నేడు రెండోరోజు మరో రెండు బంగారు పతకాలు ఇండియాకు లభించాయి. నిఖత్ జరీన్ 50 కిలోల విభాగంలో వియత్నాం బాక్సర్ ఎన్ గుయెన్ తి తంపై 5-0 తేడాతో…… 75 కిలోల విభాగంలో లవ్లీనా బోర్గోహెయిన్ 5-2తో ఆస్ట్రేలియా బాక్సర్ పార్కర్ అన్నే పై విజయం సాధించి విజేతలుగా నిలిచారు.

తెలంగాణ తేజం, బాక్సర్ నిఖత్ జరీన్ వరుసగా రెండో ఏడాది ప్రపంచ ఛాంపియన్ షిప్స్ లో స్వర్ణ పతకం సాధించి రికార్డు సృష్టించింది. గత ఏడాది టర్కీలోని ఇస్తాంబుల్ లో జరిగిన ఛాంపియన్ షిప్స్ లో 52 కిలోల విభాగంలో స్వర్ణం గెలుచుకున్న జరీన్, బర్మింగ్ హామ్ లో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ లో కూడా గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. 2011 లో యూత్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్స్ లో 48 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించడం ద్వారా అంతర్జాతీయ బాక్సింగ్ లో తన సత్తా తొలిసారి ప్రదర్శించిన నిఖత్ జరీన్ అప్పటినుంచి తన అత్యుత్తమ ప్రదర్శన కొనసాగిస్తోంది.

మరోవైపు లవ్లీనా 2020 టోక్యో ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ గెల్చుకుంది, అంతకుముందు 2018, 2019 సంవత్సరాల్లో వరల్డ్ ఛాంపియన్ షిప్స్ పోటీల్లో సైతం మూడో స్థానంలో నిలిచింది. 2022లో అమ్మన్ లో జరిగిన ఆసియన్ ఛాంపియన్ షిప్స్ లో గోల్డ్ మెడల్ గెల్చుకుంది.

ఢిల్లీ లో నేడు ముగిసిన మహిళల ఛాంపియన్ షిప్స్ పోటీల్లో మొత్తం 12 విభాగాల్లో జరిగిన పోటీల్లో నాలుగు బంగారు పతకాలు ఇండియా కు దక్కాయి. నిన్న స్వీటీ బూర, నీతూ ఘంఘాస్ లు స్వర్ణం గెల్చుకున్న సంగతి విదితమే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్