Saturday, July 27, 2024
Homeసినిమానిఖిల్ 'స్పై' విడుదల వాయిదా పడనుందా..?

నిఖిల్ ‘స్పై’ విడుదల వాయిదా పడనుందా..?

నిఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘స్పై’. ఈ చిత్రానికి ఎడిటర్ గ్యారీ దర్శకత్వం వహించారు. సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ నేపధ్యంలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాని ప్రకటించినప్పుడు అంతగా అంచనాలు లేవు కానీ.. ఎప్పుడైతే టీజర్ రిలీజ్ చేశారో అప్పటి నుంచి స్పై మూవీ పై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని జూన్ 29న విడుదల చేయనున్నట్టుగా గతంలో ప్రకటించారు.

అయితే.. ఇప్పుడు ఈ చిత్రాన్ని వాయిదా వేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. ఇది పాన్ ఇండియా మూవీ.. ప్రమోషన్స్ చేయడానికి టైమ్ కావాలి. అందుచేత ఈ మూవీ రిలీజ్ వాయిదా వేద్దామని నిఖిల్.. నిర్మాత రాజశేఖర్ రెడ్డికి చెప్పాడట. అయితే నిర్మాత రాజశేఖర్ రెడ్డి మాత్రం అనౌన్స్ చేసినట్టుగా ఈ నెల 29నే విడుదల చేద్దామని పట్టుదలగా ఉన్నాడట. ఈ విషయమై హీరో నిఖిల్, నిర్మాత రాజశేఖర్ రెడ్డి మధ్య డిఫరెన్సస్ వచ్చాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. దీంతో స్పై మూవీ 29న వస్తుందా..? వాయిదా పడుతుందా..? అనేది ఆసక్తిగా మారింది. మరి.. ఒకటి, రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్