Monday, September 23, 2024
Homeసినిమాఫిబ్ర‌వ‌రి 18న  నిఖిల్ ’18 పేజీస్’ విడుద‌ల‌

ఫిబ్ర‌వ‌రి 18న  నిఖిల్ ’18 పేజీస్’ విడుద‌ల‌

Nikhils 18 pages Will Be Releasing On February 18th 2022 :

యంగ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, గార్జియస్ బ్యూటీ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం ‘18 పేజీస్’. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో, స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ రాసిన క‌థ‌తో, డైరెక్ట‌ర్ ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ‘100 ప‌ర్సెంట్ ల‌వ్’, ‘భ‌లే భ‌లే మ‌గాడివోయ్’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘గీత గోవిందం’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల్ని నిర్మించిన జీఏ2 పిక్చ‌ర్స్…‘కుమారి 21-ఎఫ్’ వంటి సూప‌ర్ హిట్ సినిమాను నిర్మించిన సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ గా అంద‌రి మ‌న్న‌నలు అందుకుంటున్న బ‌న్నీ వాసు నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ‘18 పేజీస్’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్లకు అన్ని వ‌ర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుత‌మైన ఆద‌ర‌ణ ల‌భించింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌పంచవ్యాప్తంగా భారీ రేంజ్ లో ఫిబ్ర‌వ‌రి 18, 2022న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లుగా బ‌న్నీవాసు తెలిపారు.

స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కుమారి 21 ఎఫ్ తో యూత్ ఫుల్ డైరెక్ట‌ర్ గుర్తింపు తెచ్చుకున్న ప‌ల్నాటి సూర్య‌ప్ర‌తాప్ 18 పేజీస్ ని కూడా వినూత్నంగా తెర‌కెక్కిస్తున్నారు. న‌వీన్ నూలీ ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్య‌వ‌హరిస్తున్నారు. ఏ వ‌సంత్ సినిమాటోగ్ర‌ఫి అందిస్తున్నారు, బాబు కో ప్రొడ్యూస‌ర్. ఈ చిత్రానికి సంబంధించిన‌ మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల చేయ‌నున్నారు.

Also Read :  డబ్బింగ్ మొదలు పెట్టిన నిఖిల్ ’18 పేజెస్’

RELATED ARTICLES

Most Popular

న్యూస్