Friday, November 22, 2024
HomeTrending Newsపంజాబ్ – సింద్ రాష్ట్రాల గొడవలు

పంజాబ్ – సింద్ రాష్ట్రాల గొడవలు

పాకిస్తాన్ సాదికాబాద్ నగరంలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది చనిపోయారు. దోపిడీ, దొంగతనాలకు వచ్చిన దుండగులు ఆదివారం ఈ దారుణానికి ఒడిగట్టినట్టు సమా టీవీ పేర్కొంది. దోపిడీ దొంగలను స్థానికులు తీవ్రంగా ప్రతిఘటించటంతో కాల్పులకు దారితీసింది. పంజాబ్ రాష్ట్రంలోని సాదికబాద్ నగరంలో ఈ విధమైన కాల్పులు రెండోసారి జరిగాయి. గతంలో కాల్పులు జరిగిన ఎవరు చనిపోలేదని పోలీసులు తెలిపారు.

పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంక్వ రాష్ట్రంలో ఇలాంటి దారుణ ఘటనలు సాధారణంగా జరుగుతున్నాయి. గత నెలలో రావల్పిండిలో ఇదే మాదిరిగా జరిగిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. జులైలో పెషవార్ లో రెండు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో పది మంది చనిపోగా 30 మంది గాయపద్దారు.

పంజాబ్ – సింద్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ప్రాంతీయతత్వంతో కూడిన అల్లర్లు దోపిడీలు, కాల్పులకు మూలకారణాలు. సింద్ రాష్ట్రానికి రావల్సిన సాగునీటి వాటా, ప్రభుత్వ నిధుల్లో ఎక్కువ భాగం పంజాబ్ రాష్ట్రానికే వెలుతున్నాయని సింద్ రాష్ట్ర ప్రజలు దశాబ్దాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.  అసంతృప్తి కాస్త ఒకరిపై ఒకరు దాడులు చేసేవరకు వెళ్ళింది. రెండు రాష్ట్రాలకు చెందిన కొన్ని ఫ్యాక్షన్ గ్రూపులు ఈ దోపిడీలను ప్రోత్సహిస్తున్నాయని, వీరిని కొందరు రాజకీయ నాయకులే తమ అవసరాలకు వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కరాచీ నగరంలో పంజాబ్ రాష్ట్రానికి చెందినవారి మీద దాడులు కూడా చేస్తున్నారు. భాష, సంస్కృతుల పరంగా సింద్ ప్రజలను పాకిస్తాన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందనే వాదన ఉంది. పాకిస్థాన్ ప్రభుత్వంలో పంజాబ్ రాష్ట్రం వారిది ఆధిపత్యం. పాకిస్తాన్ దేశం ఏర్పడిన నుంచి రాజకీయంగా, అధికార యంత్రాంగంలో పంజాబ్ కు చెందిన నాయకులు, అధికారులు కీలక స్థానాల్లో ఉంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్