Wednesday, March 11, 2026
Homeసినిమాదిల్ రాజు బ్యానర్‌లో 'తమ్ముడు'గా రాబోతున్న నితిన్

దిల్ రాజు బ్యానర్‌లో ‘తమ్ముడు’గా రాబోతున్న నితిన్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మరో క్రేజీ కాంబినేషన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నితిన్, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘తమ్ముడు’ సినిమా గ్రాండ్ గా లాంఛ్ అయ్యింది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ ఫైనాన్షియర్ ప్రసాద్ క్లాప్ ఇవ్వగా, దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుడు వంశీ పైడిపల్లి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. దిల్ రాజు నిర్మాణంలో నిర్మితమవుతున్న 56వ చిత్రమిది.

ఈ సంస్థతో నితిన్, వేణు శ్రీరామ్ కు మంచి అనుబంధం ఉంది. నితిన్ దిల్, శ్రీనివాస కళ్యాణం వంటి మూవీస్ చేయగా..దర్శకుడు శ్రీరామ్ వేణు నాని హీరోగా ‘MCA’, వకీల్ సాబ్ వంటి సూపర్ హిట్ చిత్రాలు రూపొందించారు. ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేషన్ లో ‘తమ్ముడు’ సినిమా లాంఛ్ అవడం సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ చిత్రానికి సత్యజిత్ పాండే (సేతు) సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు. సెప్టెంబర్ 1 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ఈ సినిమా నుంచి మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular