Saturday, March 14, 2026
Homeసినిమానితిన్, వక్కంతం వంశీ చిత్రం ప్రారంభం

నితిన్, వక్కంతం వంశీ చిత్రం ప్రారంభం

Nitin-Vamshi: నితిన్ తన 32వ చిత్రాన్ని వక్కంతం వంశీ దర్శకత్వంలో శ్రేష్ట్ మూవీస్ ప్రొడక్షన్ బేనర్ లో చేస్తున్నారు. ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ తో క‌లిసి శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నికితారెడ్డి, సుధాకర్ రెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గ్రాండ్ గా ప్రారంభమయింది. ముహూర్తం షాట్ కు పుస్కూర్ రామ్మోహన్ రావు క్లాప్ కొట్టగా, ఆదిత్య మ్యూజిక్ ఉమేష్ గుప్తా కెమెరా స్విచాన్ చేశారు. దర్శకుడు సురేందర్ రెడ్డి తొలి షాట్ కి గౌరవ దర్శకత్వం వహించారు. సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి, ఠాగూర్ మధు వంశీకి  స్క్రిప్ట్ను అందజేశారు.
ప్రస్తుతం నితిన్ నటిస్తున్న `మాచర్ల నియోజకవర్గం` సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.  దీనితర్వాత  తాజా చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో నితిన్ సరసన మోస్ట్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కథలు అందించిన వక్కంతం వంశీ పూర్తిగా భిన్నమైన పాత్రలో నితిన్ ను చూపించబోతున్నాడు. నితిన్  కోసం ఆయన పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ను రెడీ చేశాడు.
ప్రముఖ టెక్నీషియన్స్ పని చేయనున్న ఈ చిత్రాన్ని  శ్రేష్ఠ్ మూవీస్ ప్రొడక్షన్ నెం 9గా రూపొందిస్తుండగా,  రాజ్ కుమార్ ఆకెళ్ల ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపడుతుండగా సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular