Thursday, March 19, 2026
Homeసినిమాఏప్రిల్ 29న నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’

ఏప్రిల్ 29న నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’

Nithins Macherla Niyojakavargam Will Be Releasing On April 29th  :

విభిన్న కథలు చేస్తూ అలరిస్తున్న హీరో నితిన్ ఇప్పుడు సరికొత్త  కాన్సెప్టుతో రాబోతోన్నారు. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతోన్న చిత్రంలో నితిన్‌ను ఫుల్ యాక్షన్ మోడ్‌లో ప్రేక్షకులు చూడబోతోన్నారు. ఆదిత్య మూవీస్ & ఎంటర్ టైన్మెంట్స్ అసోసియేషన్ తో శ్రేష్ట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.  తాజాగా ఈ సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఎంతో పవర్ ఫుల్‌గా ఉంది. తన మీదకు దాడి చేసేందుకు వస్తోన్న వారి పై నితిన్ విరుచుకుపడు తుండడం ఈ పోస్టర్లో చూడొచ్చు.

వేసవి సెలవులను మాచర్ల నియోజకవర్గం కరెక్ట్ గా ఉపయోగించుకోనుంది. ఈ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో పొలిటికల్ అంశాలు హైలెట్ కానున్నాయి. కృతి శెట్టి- నితిన్ ల ప్రేమ కథ కూడా కొత్తగా ఉండబోతోంది.

భీష్మ, మాస్ట్రో వంటి చిత్రాల తరువాత మూడోసారి మహతి స్వరసాగర్‌తో కలిసి నితిన్ పని చేస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ల కెమెరామెన్‌గా, మామిడాల తిరుపతి మాటల రచయితగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్‌గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన మోషన్ పోస్టర్ సినిమా మీద అంచనాలను పెంచింది.

ఇవి కూడా చదవండి:  తప్పనిసరి పరిస్థితుల్లోనే…. : నితిన్

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular