Sunday, January 19, 2025
Homeసినిమాపోటీకి సై అంటోన్న‌ అఖిల్, నితిన్, స‌మంత‌

పోటీకి సై అంటోన్న‌ అఖిల్, నితిన్, స‌మంత‌

Three Roses: అక్కినేని అఖిల్ న‌టిస్తోన్న తాజా చిత్రం ఏజెంట్. ఈ చిత్రానికి స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అనిల్ సుంక‌ర‌, సురేంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్నిసంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ భారీ యాక్ష‌న్ మూవీని ఆగ‌ష్టు 12న విడుద‌ల చేయ‌నున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఈ సినిమా ఆగ‌ష్టులో రాదు అంటూ వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. ఆగ‌ష్టు 12న వ‌స్తున్నాం అంటూ ఏజెంట్ మేక‌ర్స్ మ‌రోసారి క్లారిటీ ఇచ్చారు.

ఇక నితిన్ న‌టిస్తోన్న తాజా చిత్రం మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం. ఈ చిత్రాన్ని కూడా ఆగ‌ష్టు 12న విడుద‌ల చేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. అఖిల్, నితిన్ మ‌ధ్య పోటీ అనుకుంటే.. నేనున్నాను అంటూ స‌మంత య‌శోద‌ సినిమాతో ఆగ‌ష్టు 12నే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఇలా ఆగ‌ష్టు 12న అఖిల్ ఏజెంట్, నితిన్ మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం, స‌మంత య‌శోద చిత్రాలు విడుద‌ల‌కు రెడీ అవుతుండ‌డం ఆస‌క్తిగా మారింది.

ఇదిలా ఉంటే.. ఆగ‌ష్టు 11న అమీర్ ఖాన్, నాగ‌చైత‌న్య క‌లిసి న‌టించిన లాల్ సింగ్ చ‌ద్దా విడుద‌ల కానుంది. ఈ సినిమాను ఎప్పుడో రిలీజ్ చేయాలి కానీ.. కొన్ని కార‌ణాల వ‌ల‌న వాయిదా వేశారు. ఆఖ‌రికి ఆగ‌ష్టు 11న విడుద‌ల చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారు. దీంతో ఈ ఆగ‌ష్టులో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ ఈ ర‌స‌వ‌త్త‌ర‌మైన పోటీ ఏర్ప‌డింది. మ‌రి.. ఈ సినిమాల‌ను ప్ర‌క‌టించిన‌ట్టుగా అదే డేట్ కి రిలీజ్ చేస్తారో.. లేక ఏ సినిమా అయినా రిలీజ్ డేట్ ను మార్చుకుంటుందో చూడాలి.

Also Read : ‘లాల్ సింగ్ చద్దా’లో చైత‌న్య‌ పాత్ర పెంపు?  

RELATED ARTICLES

Most Popular

న్యూస్