Friday, April 19, 2024
Homeసినిమానివేదా పేతురాజ్ ‘బ్ల‌డీ మేరి’ ఫస్ట్ లుక్ విడుదల

నివేదా పేతురాజ్ ‘బ్ల‌డీ మేరి’ ఫస్ట్ లుక్ విడుదల

Bloody Mery: 100% తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’ రోజురోజుకీ గ‌ణ‌నీయంగా త‌న ప్ర‌భావాన్ని పెంచుకుంటూ తెలుగు వారికి హృద‌యాల్లో సుస్థిర‌మైన స్థానాన్ని ద‌క్కించుకుంటోంది. 100% ఎంటైర్‌టైన్మెంట్‌ను అందిస్తామ‌నే మాట‌ను నిల‌బెట్టుకుంటూ వ‌స్తోన్న ఆహాలో ఇప్పుడు సీట్ ఎడ్జ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ వెబ్ ఒరిజినల్ ‘బ్లడీ మేరి’ ప్రీమియర్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. నివేదా పేతురాజ్ తెలుగు ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు చందు మొండేటి డిజిట‌ల్ మాధ్య‌మంలో తెర‌కెక్కించిన తొలి ఒరిజిన‌ల్ ఇది. ఈ వెబ్ ఒరిజిన‌ల్ నుంచి నివేదా పేతురాజ్ పాత్ర‌ను రివీల్ చేస్తూ ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు.

ఈ ఫ‌స్ట్ లుక్‌ను గ‌మ‌నిస్తే.. ఇందులో నివేదా లుక్ భ‌య‌పెట్టేలా ఇన్‌టెన్స్‌ తో ఉంది. ‘ఇఫ్ యువార్ బ్యాడ్, షి ఈజ్ బ్లడీ బ్యాడ్’ అనేది ట్యాగ్ లైన్‌. వైక‌ల్యంతో ఇబ్బంది ప‌డుతున్న‌ప్ప‌టికీ త‌న స‌మ‌స్య‌ల‌ను ధైర్యంగా ఎదుర్కొన‌గ‌లిగే అమ్మాయిగా ఇందులో నివేదా న‌టించారు. ఆమెను ప్రేమించిన వారి కోసం ఎంత‌టి స‌మ‌స్య‌నైనా ఎదుర్కొన‌గ‌లిగే అమ్మాయే మేరి. కిరిటీ దామ‌రాజు, రాజ్ కుమార్ క‌సిరెడ్డి, బ్ర‌హ్మాజీ, అజ‌య్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్ (సై ఫై థ్రిల్ల‌ర్ కుడి ఎడ‌మైతే రూపొందించిన నిర్మాత‌) ఈ చిత్రాన్ని నిర్మించారు. కార్తికేయ వంటి థ్రిల్ల‌ర్ జోన‌ర్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన ద‌ర్శ‌కుడు చందు మొండేటి ఈ మూవీని డైరెక్ట‌ర్ చేశారు. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని సినిమాటోగ్రాఫ‌ర్‌. కాల భైర‌వ సంగీతాన్ని అందించారు. త్వరలోనే బ్లడీ మేరి ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : ఐకాన్ స్టార్ ప్రెజెంట్స్ ‘ఆహా 2.0’

RELATED ARTICLES

Most Popular

న్యూస్