Monday, February 24, 2025
HomeTrending Newsబిఆర్ఎస్ ప్రభావం ఏపీలో ఉండదు: జోగి

బిఆర్ఎస్ ప్రభావం ఏపీలో ఉండదు: జోగి

ఆంధ్రప్రదేశ్ లో మరో 25 ఏళ్ళపాటు వైఎస్ జగనే ముఖ్యమంత్రిగా ఉంటారని, మరో పార్టీకి రాష్ట్రంలో అవకాశం లేదని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి  రమేష్ వ్యాఖ్యానించారు.  తెలంగాణా ముఖ్యమంత్రి  కెసిఆర్ నేడు ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి పార్టీపై అయన స్పందించారు. ఎ పార్టీకి భయ పడాల్సిన అవసరం తమకు లేదని, ఒకరికి భయపడేవాళ్ళం కాదని అన్నారు.

పార్టీలు పెట్టుకునే హక్కు ఎవరికైనా ఉంటుందని, ఆయా పరిస్థితులను బట్టి వారు పార్టీలు పెట్టుకుంటారని జోగి  అభిప్రాయపడ్డారు. ఏపీలో బిఆర్ఎస్ ప్రభావం పెద్దగా ఉండబోదని అయన ధీమా వ్యక్తం చేశారు.

Also Read : టిఆర్ఎస్ ఇక భారత రాష్ట్ర సమితి

RELATED ARTICLES

Most Popular

న్యూస్