-0.2 C
New York
Wednesday, November 29, 2023

Buy now

Homeతెలంగాణలాక్ డౌన్ పెట్టండి లేదా కర్ఫ్యూ పెంచండి- హైకోర్టు

లాక్ డౌన్ పెట్టండి లేదా కర్ఫ్యూ పెంచండి- హైకోర్టు

రాష్ట్రంలో వారాంతపు లాక్‌డౌన్‌ లేదా కర్ఫ్యూ వేళల పొడిగింపును పరిశీలించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.  రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణకు ఆరోగ్య శాఖ  డైరెక్టర్ శ్రీనివాసరావు, డీజీపీ మహేందర్‌రెడ్డి హాజరయ్యారు.

రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు,  మరణాలను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 8కి వీలైనంత ముందే నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచిందింది.  ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స, ఔషధాల గరిష్ఠ ధరలపై తాజా మార్గదర్శకాలు విడుదల చేయాలన్న న్యాయస్థానం తక్కువ సంఖ్యలో కరోనా పరీక్షలు  చేస్తుండడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది.

రెండ్రోజుల్లో కరోనాపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని, మాస్కులు ధరించనివారి వాహనాల జప్తును పరిశీలించాలని హైకోర్టు పేర్కొంది.  ఆర్టీపీసీఆర్‌ ఫలితాలు 24 గంటల్లో వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తూ  తదుపరి విచారణ ఈ నెల 13కి వాయిదా వేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్