Saturday, January 18, 2025
Homeసినిమాఓటిటి వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఖిలాడి

ఓటిటి వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఖిలాడి

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ఖిలాడి. ఈ చిత్రానికి రాక్షసుడు సినిమాతో సక్సస్ సాధించిన రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తుండడం విశేషం. డింపుల్ హయాతి మరియు మీనాక్షి చౌదరిలు రవితేజ సరసన నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్ కు అనూహ్యమైన స్పందన రావడం.. బ్లాక్ బస్టర్ మూవీ క్రాక్ తర్వాత రవితేజ చేస్తున్న సినిమా కావడంతో ఖిలాడి సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే.. కరోనా కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడింది. ఈ మూవీని మే 28న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కరోనా కేసులు పెరగడం.. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. అయితే.. ఈ సినిమాకి ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ఆఫర్ ఇచ్చిందని వార్తలు వచ్చాయి.

ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మూవీ రాధే డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైంది. దీంతో భారీ చిత్రాలు కూడా ఓటీటీలో రిలీజ్ కానున్నాయని టాక్ వినిపిస్తోంది. ఖిలాడి మూవీ కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే.. ప్రచారంలో ఉన్న ఈ వార్తల పై ఖిలాడి మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఖిలాడి చిత్రాన్ని త్వరలో థియేటర్ లోనే రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్