శ్రీలంక ప్రధానమంత్రి, అధ్యక్షుడు భారత్ కు వెళ్లిపోతున్నారనే వార్తల్లో నిజం లేదని కొలంబోలోని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. లంకలో ప్రజాస్వామ్యం నిలబడేందుకు ఇండియా ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని భారత హై కమిషన్ వెల్లడించింది. రాజకీయ నాయకులు, ఇతర ఉన్నతాధికారులు ఇండియాకు పారిపోతున్నారని సిలోన్ వ్యాప్తంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత్ తన వైఖరి తేల్చి చెప్పింది.
లంకలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం భారత బలగాలు కొలంబో వెలుతున్నాయని వస్తున్న వార్తలు నిరాధారమని భారత్ ఖండించింది. ఆర్థిక వ్యవస్థ చక్కబడేందుకు, శాంతి భద్రతలు నెలకొనేందుకు సహకరిస్తామని వెల్లడించింది. లంకలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి. ప్రజాధనానికి, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే వారిని ఉపేక్షించకుండ కాల్చివేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ కోతలు, చమురు కొరత, ఆహార నిల్వలు అడుగంటిపోవటంతో ఆందోళనలు కాస్తా దాడులు, దోపిడీలకు దారితీస్తున్నాయి. మహింద రాజపక్స పారిపోయి ఓ బంకర్ లో దాక్కున్నాడు. లంక ప్రధానమంత్రి మహింద రాజపక్స రాజీనామా చేసినా శాంతించని ఆందోళన కారులు దేశాధ్యక్షుడు గోటబాయ రాజపక్స కూడా గద్దె దేగాలని డిమాండ్ చేస్తున్నారు.
రాజపక్స కుటుంబం అన్ని పదవుల నుంచి దిగిపోతేనే దేశ ప్రజలు శాంటించే అవకాశం ఉందని ఇప్పటికే అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. నిరసనకారులతో చర్చలు జరపాలని యురోపియన్ దేశాలు, అమెరికా రాజపక్స ప్రభుత్వానికి సూచించాయి. రాజపక్స కుటుంబం వల్లే లంకలో అనిశ్చితి నెలకొందని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి.
Also Read : మహింద రాజపక్స రాజీనామా