Saturday, November 23, 2024
HomeTrending Newsఉత్తరకొరియా బాలిస్టిక్‌ క్షిపణితో ఉద్రిక్తత

ఉత్తరకొరియా బాలిస్టిక్‌ క్షిపణితో ఉద్రిక్తత

ఉత్తర కొరియా  -దక్షిణ కొరియాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తరకొరియా మరోసారి బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించింది. తూర్పు సముద్ర తీరం వైపు కిమ్‌ సైన్యం ఓ బాలిస్టిక్‌ క్షిపణిని బుధవారం ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. అమెరికా-దక్షిణకొరియా సైన్యాలు భారీస్థాయిలో సంయుక్త గగణతల విన్యాసాలు నిర్వహించిన నేపథ్యంలో హెచ్చరికగా ఈ ప్రయోగం చేపట్టినట్లు తెలిపింది.

తూర్పు సముద్రం వైపు ఉత్తర కొరియాకు చెందిన ఓ క్షిపణిని దూసుకెళ్లిందని సియోల్‌ సైన్యం పేర్కొన్నది. తూర్పు సముద్రాన్ని జపాన్‌ సముద్రం అనికూడా పిలుస్తారు.  గత వారం రోజుల్లో జపాన్‌వైపు క్షిపణులను ప్రయోగించడం ఇది రెండోసారి. గత నెల 28న ఇదే తరహాలో తూర్పు సముద్రం వైపు బాలిస్టిక్‌ మిస్సైల్స్‌ను పరీక్షించింది. నెల రోజుల వ్యవధిలో ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం చేయడం ఇది ఎనిమిదోసారి. దాదాపు ఐదేళ్లలో తొలిసారిగా అక్టోబరు 4వ తేదీన ఉత్తర కొరియా జపాన్ మీదుగా మధ్యశ్రేణి క్షిపణిని ప్రయోగించిన రెండు రోజుల తర్వాత బాలిస్టిక్ క్షిపణి పరీక్ష నిర్వహించింది.

ఉత్తర కొరియా దుందుడుకు వ్యవహారంపై దక్షిణ కొరియా అగ్గి మీద గుగ్గిలం అయింది. ఈ రోజు పరీక్ష జరిపిన మిస్సైల్ దక్షిణ కొరియాకు అత్యంత చేరువలోనే పడటం అనుమానాలకు తావిస్తోంది. దీంతో దక్షిణ కొరియా అలెర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా గగనతంలంలో ఎలాంటి విపత్తునైనా ఎదుర్కునేందుకు అయినా సిద్దంగా ఉండాలని వాయుసేనను సియోల్ అప్రమత్తం చేసింది.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్