Sunday, January 19, 2025
HomeTrending Newsమోడీ, షా పర్యటనలు ఎందుకు -మంత్రి హరీష్

మోడీ, షా పర్యటనలు ఎందుకు -మంత్రి హరీష్

Single Project  : 70 ఏళ్లలో గత ప్రభుత్వాలు 3 కాలేజీలు ఏర్పాటు చేస్తే, సీఎం కేసీఆర్ 7 ఏళ్ళలో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి మీద రు. 11,711 కోట్లు ఖర్చు చేసామని వెల్లడించారు. రూ. 56 కోట్లతో 390 పడకల ఆసుపత్రికి, రు. 1.25 కోట్లతో టి డయాగ్నొస్టిక్ నిర్మాణాలకు శంకుస్ధాపన, రూ. 5.98 కోట్లతో ఎర్రగుట్ట నుండి ఎక్లాస్ మీదుగా తెలంగాణ – కర్ణాటక సరిహద్దు వరకు నిర్మించిన 5.5 కిలోమీటర్ల రోడ్డును, డయాలసిస్ యూనిట్ ని ప్రారంభించిన ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, రామ్ మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన తదితరులు ఉన్నారు.

ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ…

390 పడకల ఆసుపత్రి ఏర్పాటు కోసం శంకుస్ధాపన చేసుకోవడం శుభ దినం. తెలంగాణ రావడం వల్ల కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం వల్ల ఇది సాధ్యమైంది. నాగం జనార్ధన్ రెడ్డి, డీకే అరుణ ఇక్కడి నుండి మంత్రులుగా ఉన్నారు. ఒక్క మెడికల్ కాలేజీ తీసుకురాలేదు. ఈ రోజు ఒక్క ఉమ్మడి మహబూబ్ నగర్ లోనే మొత్తం 4 మెడికల్ కాలేజీల ఏర్పాటు జరుగుతున్నది. నారాయణ్ పేటలో మెడికల్ కాలేజ్ వస్తుంది.

మీ కోరిక మేరకు నారాయణ్ పెట్ లో ఈ విద్యా సంవత్సరంలోనే నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేస్తాం. ఒక్క పైసా ఖర్చు లేకుండా పేదలకు డయాలసిస్ సేవలు అందేలా డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాము. ఉచితంగా 57 రకాల పరీక్షలు చేసే టి డయాగ్నొస్టిక్ సెంటర్ ని ప్రారంభించాము. ఎక్స్ రే, అల్ట్రా సౌండ్, టు డి ఏకో సేవలు కూడా ఇక్కడ అందుతాయి.

కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉంటున్నారు మీకు బాగా తెల్సు. అక్కడ రైతులకు 6 గంటల కరెంట్ ఉందా. తెలంగాణలో 24 గంటల కరెంట్ వస్తుంది. బిజెపి పాలన రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదు. బిజెపి ఫెయిల్, టిఆర్ ఎస్ పాస్ అయినట్టే కదా. 57 ఏళ్లకే పింఛన్లు ఇచ్చే కార్యక్రమం మొదలు అవుతుంది. కొత్తగా 10 లక్షల పింఛన్లు ఇవ్వబోతున్నము.

మన వడ్లను కేంద్రం కొనలేదు మేము కొంటున్నం. మేమే అమిత్ షా సమాధానం చెప్పాలి, కర్ణాటకలో ఎందుకు కొనడం లేదు. కొనే దగ్గర ఎందుకు లోల్లి చేస్తున్నారు. బండి సంజయ్ ఏం ముఖం పెట్టుకొని పాదయాత్ర చేస్తున్నారు. ఎలా వడ్ల కుప్పలా దగ్గరికి పోతున్నారు సమాధానం చెప్పాలి. రాయచూర్ లో కలుషిత నీరు తాగి ముగ్గురు చనిపోయారు, 300 మంది ఆసుపత్రి పాలయ్యారు. అది మీ పాలన. పాదయాత్ర చేస్తా అంటే ఎక్కడికక్కడ నిలదీయాలి. మీ రాష్ట్రాల్లో మీరు ఇచ్చే హామీలు అమలు చేసి మాట్లాడాలని అడగాలి.

బిజేపి, కాంగ్రెస్ అధికారం లేదు, అధికారంలోకి రావు. అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. ప్రధాని ఏం ముఖం పెట్టుకొని వస్తారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, కోచ్ ఫ్యాక్టరీ వంటి విభజన హామీలు ఎందుకు ఇవ్వరు. ఏపీ కర్ణాటక మధ్య ప్రదేశ్ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చారు. మాకు ఎందుకు ఇవ్వవు. 2014 లో మోడీ అన్నాడు గెలిస్తే పాలమూరు పూర్తి చేస్తాం అని, 8 ఏళ్లు అయింది. గ్రామ పంచాయితీలకు డబ్బు ఇవ్వలేదా..? ట్రాక్టర్, ట్రాలీ, డంప్ యార్డులు, ప్రకృతి వనాలు, వైకుంఠ దామాలు ఎలా అయ్యాయి మరి.

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కోసం రు. 11,711కోట్లు చెల్లింపులు చేయడం జరిగింది. డిల్లీ నుండి రావాల్సిన సీ సీ రోడ్ల సొమ్ము మాత్రం పెండింగ్ లో ఉంది. స్థానికులకే 95 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. గ్రూప్ 4, టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తాయి. స్థానికులకే అవకాశం లభిస్తుంది. యువత ఉపయోగించుకోవాలి.

• మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ….
గత ప్రభుత్వాలు మన ఆరోగ్యాన్ని పట్టించుకున్నయా.. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్ట పోయేవారు..కనీస వైద్యం అందక జనాలు ఇబ్బంది పడేవారు. రైతు బంధు ఇచ్చారా, రైతు బీమా ఇచ్చారా, కల్యాణ లక్ష్మి ఇచ్చారా.. బిజెపికి మత పిచ్చి, కాంగ్రెస్ కు కుల పిచ్చి పుట్టింది.
కొందరి ఓట్లతో ఎవరు రాజకీయ నాయకుడు కాడు. ప్రజా ప్రతినిధి కాడు. అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులు ఉండాలి. కేసీఆర్ బెదిరింపులకు ఎన్నడూ భయపడడు. ఈ జాతీయ పార్టీల నేతలు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నారని మంత్రి ప్రశ్నించారు.

Also Read : సాధారణ కాన్పులు చేస్తే ప్రోత్సాహకాలు – మంత్రి హరీష్  

RELATED ARTICLES

Most Popular

న్యూస్