యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమా నేడు  లాంఛనంగా ప్రారంభమైంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తోంది. యువ సుధా ఆర్ట్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా  నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం, రత్నవేల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.  ప్రతినాయకుడిగా బాలీవుడ్ స్టార్  సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో జరిగిన ఈ పూజా కార్యక్రమానికి దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి, ప్రశాంత్ నీల్, ప్రకాశ్ రాజ్, నిర్మాతలు దిల్ రాజు, నాగ వంశీ, నటుడు శ్రీకాంత్, కళ్యాణ్ రామ్ హాజరయ్యారు.  వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలు కానుంది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ లపై చిత్రీకరించిన తొలి షాట్ కు రాజమౌళి క్లాప్ ఇవ్వగా, ప్రశాంత్ నీల్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

”అనగనగా సముద్ర తీర ప్రాంతం! మనం మర్చిపోయిన భూభాగం! ఆ ప్రాంతంలో మనుషుల కంటే ఎక్కువ మృగాలు ఉంటాయి (మృగాలు లాంటి మనుషులు అన్నమాట). భయం అంటే ఏమిటో తెలియని మృగాలు అవి. దేవుడు అంటే భయం లేదు. చావు అన్నా భయం లేదు. కానీ, ఒక్కటి అంటే భయం. ఆ భయం (ఎన్టీఆర్ పాత్రను ఉద్దేశిస్తూ…)ఏమిటో మీకు తెలిసే ఉంటుంది. ఇదీ కథా నేపథ్యం”  అంటూ దర్శకుడు కొరటాల సినిమా కథను వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *