Sunday, January 19, 2025
Homeసినిమాఫాన్స్ కి సారీ చెప్పిన ఎన్టీఆర్!

ఫాన్స్ కి సారీ చెప్పిన ఎన్టీఆర్!

ఎన్టీఆర్ అభిమానులంతా ‘దేవర’ సినిమా కోసం చాలా కాలంగా ఎంతో కుతూహలంతో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 27వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటు నిన్న హైదరాబాద్ – ‘నోవాటెల్’ హోటల్లో జరగవలసి ఉంది. అయితే చివరి నిమిషంలో కేన్సిల్ అయింది. ఈవెంట్ జరగవలసిన హాల్ కెపాసిటీకి మించి పాస్ లు ఇవ్వడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. సినిమా టీమ్ .. గెస్టులు .. వీఐపీలు స్టేజ్ వరకూ వెళ్లే అవకాశం లేకపోవడం వలన కేన్సిల్ చేశారని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ను నిరాశపరిచినందుకు ఎన్టీఆర్ సారీ చెప్పాడు. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా ఒక వీడియోను వదిలాడు. ఈవెంట్ జరిగే రోజు కోసం తాను కూడా చాలా రోజులుగా ఎదురుచూస్తూ వచ్చాననీ, అభిమానులతో ఈ సినిమా ముచ్చట్లను పంచుకోలేకపోయినందుకు తనకి కూడా చాలా బాధగా ఉందని అన్నాడు. ఈ సినిమా కోసం కొరటాల ఎంతో కష్టపడ్డారనీ, తప్పకుండా విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉందని చెప్పాడు. ఈ నెల 27వ తేదీన థియేటర్లలో కలుసుకుందామని అన్నాడు.

సుధాకర్ మిక్కిలినేని – కొసరాజు హరికృష్ణ – నందమూరి కల్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమాకి, అనిరుధ్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే పాటలు జనంలోకి దూసుకుని వెళ్లాయి. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయడం .. ఈ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ లో పరిచయమవుతూ ఉండటం ప్రత్యేకమైన ఆకర్షణగా మారింది. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాలో, ప్రకాశ్ రాజ్ .. శ్రీకాంత్ .. షైన్ టామ్ చాకో ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ సినిమా ఓపెనింగ్ రికార్డ్స్ ఎలా ఉంటాయో చూడాలి మరి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్