Saturday, January 18, 2025
Homeసినిమాఫైర్ అవుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్..?

ఫైర్ అవుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్..?

‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ అయిన తర్వాత నుంచి ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ కొరటాల శివతో అని.. ఈ సినిమా ఇదిగో స్టార్ట్ అవుతుంది. అదిగో స్టార్ట్ అవుతుంది అంటూ ప్రచారం జరిగింది కానీ.. ఇప్పటి వరకు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అధికారికంగా ప్రకటించలేదు. కారణం ఏంటంటే.. కొరటాల తెరకెక్కించిన ‘ఆచార్య’ ప్లాప్ అవ్వడంతో కథ పై బాగా కసరత్తు చేయమని ఎన్టీఆర్ చెప్పారు. అందుకనే అప్పటి నుంచి ఇప్పటి వరకు కొరటాల కథ పై కసరత్తు చేస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎంత రచ్చ చేసినా ఎప్పుడు ఈ మూవీ సెట్స్ పైకి వస్తుందో చెప్పలేదు.

అయితే.. నిన్న ఎన్టీఆర్, కొరటాల మూవీ అప్ డేట్ వచ్చేస్తోంది అంటూ సోషల్ మీడియాలో అందరూ హోరెత్తించేశారు. ఈ సినిమాకు టైటిల్ ఏమైనా ఖరారు చేశారేమో.. లేక ఫలానా రోజు సినిమా మొదలవుతుందని  ప్రకటిస్తారేమో అనుకుంటే.. చివరికి అలాంటిదేమీ లేదు. ఈ సినిమా క్యాన్సిల్ కాలేదు, త్వరలోనే మొదలవుతుంది అన్నదే ఈ అప్‌డేట్ సారాంశం. ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలులతో కలిసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను కొరటాల పూర్తి చేసినట్లు, నవంబరు నెలాఖరు నుంచి ఈ సినిమా కోసం అనిరుధ్ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెడతాడని సమాచారం ఇచ్చారు.

ఈ సినిమా క్యాన్సిల్ కాలేదు, ఉంది అని చెప్పడం కూడా ఒక అప్‌డేటేనా సోషల్ మీడియాలో కొంత మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా ఫీలవుతున్నారు. ఫైర్ అవుతున్నారు. అసలు సినిమా క్యాన్సిల్ అయ్యిందని ఎవరు ఫిక్సయ్యారు.? ఏంటీ అప్ డేట్..? అనే ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఎన్నాళ్లు ఎన్టీఆర్ టైమ్ వేస్ట్ చేస్తారు.. సరిగ్గా సినిమాను ఎప్పుడు మొదలుపెడతారో, ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. మరి.. ఎన్టీఆర్, కొరటాల ఇకనైనా కరెక్ట్ అప్ డేట్ ఇస్తారని ఆశిద్దాం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్