Monday, June 15, 2026
HomeసినిమాDevara: ఎన్టీఆర్, కొరటాల మూవీ టైటిల్ 'దేవర'

Devara: ఎన్టీఆర్, కొరటాల మూవీ టైటిల్ ‘దేవర’

యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘దేవర’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ కు అనూహ్య స్పందన వచ్చింది. అయితే.. ఈ చిత్రానికి ముందు నుంచి దేవర అనే టైటిల్ ఖరారు చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆఖరికి ఈ వార్తలే నిజం అయ్యాయి. ఈ ఫస్ట్ లుక్ లో ఎన్టీఆర్ పవర్ ఫుల్ గా కనిపించడంతో సినిమా పై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి.

ఈ ఫస్ట్ లుక్ కు అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ “వావ్ తారక్ అన్నా.. నా బ్రదర్ అనిరుథ్ రవి చందర్ దీన్ని అదరగొట్టేస్తాడు” అనేలా కామెంట్స్ చేశారు.  ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కావడం.. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, సైఫ్ ఆలీఖాన్ నటిస్తుండడంతో భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. నందమూరి కళ్యాణ్‌ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి.. దేవర సినిమాతో యంగ్ టైగర్ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular