Friday, March 29, 2024
Homeసినిమాఎన్టీఆర్ ప్రాజెక్ట్ గోపీచంద్ కి సెట్ అయ్యిందా..?

ఎన్టీఆర్ ప్రాజెక్ట్ గోపీచంద్ కి సెట్ అయ్యిందా..?

NTR-Gopichand: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీతో నేష‌న‌ల్ లెవ‌ల్ లో క్రేజ్ సంపాదించుకున్నారు. దీంతో ఎన్టీఆర్ తో వ‌ర్క్ చేయాల‌ని టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ మాత్ర‌మే కాదు.. కోలీవుడ్, బాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కూడా ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. అయితే.. కోలీవుడ్ లో మాస్ యాక్ష‌న్ మూవీస్ డైరెక్ట్ చేయాలంటే.. హ‌రి పేరే చెబుతారు. ఆయ‌న సినిమాల్లో మాస్ మసాల ఎంటుందో తెలుగు ప్రేక్ష‌కుల‌కు తెలుసు. హ‌రి దర్శకత్వంలో తమిళంలో విక్రమ్ హీరోగా రూపొందిన సామి, సూర్య హీరోగా ఆయన తెరకెక్కించిన సింగం సిరీస్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి… ఎంత‌గానో న‌చ్చాయి.

ఇదిలా ఉంటే.. ఈ మాస్ మ‌సాలా డైరెక్ట‌ర్ హ‌రి ఎప్ప‌టి నుంచో ఎన్టీఆర్ తో సినిమా చేయాలి అనుకుంటున్నారు. ఎన్టీఆర్ కి క‌థ‌ను వినిపించ‌డం.. అది ఎన్టీఆర్ కు న‌చ్చ‌డం కూడా జ‌రిగింద‌ట‌. అయితే.. ఎన్టీఆర్ కొర‌టాల‌తో ఓ మూవీ, ప్ర‌శాంత్ నీల్ తో ఓ మూవీ చేయ‌డానికి ఓకే చెప్పారు. అలాగే మ‌రో ఇద్ద‌రికి మాట ఇచ్చార‌ట‌. అందువలన ఎన్టీఆర్ ఇప్పట్లో అందుబాటులోకి రావడం కష్టమే అనే విషయం హరికి అర్థమైంది.

దాంతో ఆయన ఆ కథను గోపీచంద్ కి వినిపించాడట. ఆ కథ నచ్చడంతో వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టుగా సమాచారం. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్ర .. తన ఇమేజ్ కి తగిన కథ కావడంతో గోపీచంద్ ఓకే అన్నార‌ట‌. గోపీచంద్ కి ఇక్కడ మాస్ యాక్షన్ ఇమేజ్ ఉంది. ఇక హరి సినిమాలన్నీ కూడా దాని చుట్టూనే తిరుగుతాయి. త్వ‌ర‌లోనే ఈ మూవీని ప్ర‌క‌టిస్తార‌ని స‌మాచారం. మ‌రి.. ఈ సినిమాతో అయినా గోపీచంద్ ఆశించిన స‌క్సెస్ సాధిస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్