Friday, March 29, 2024
Homeసినిమాబిగ్ బాస్ 7 హోస్ట్ బాలకృష్ణా..? ఎన్టీఆరా..?

బిగ్ బాస్ 7 హోస్ట్ బాలకృష్ణా..? ఎన్టీఆరా..?

బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 6 సీజన్  ఇటీవలే ముగిసింది. ఫస్ట్ సీజన్ కు ఎన్టీఆర్, సెకండ్ సీజన్ కు నాని హోస్ట్ లుగా ఉండగా సీజన్ 3 నుంచి 6 వరకు కింగ్ నాగార్జున హోస్ట్ గా చేశారు. అయితే.. ఈ మధ్య కాలంలో బిగ్ బాస్ పై జనాల్లో ఇంట్రస్ట్ తగ్గింది. సీజన్ 6 ఆశించిన స్థాయిలో జనాలను ఆకట్టుకోలేకపోయింది. దీంతో బిగ్ బాస్ 7 పై ప్రత్యేక దృష్టి పెట్టింది స్టార్ మా యాజమాన్యం. నాగార్జున కూడా బిగ్ బాస్ 7 కు హోస్ట్ గా ఉండనని చెప్పడంతో స్టార్ హీరోలు, సీనియర్ హీరోల్లో ఎవరైతే బాగుంటుందని ఆలోచిస్తున్నారట.

ఇప్పటికే నటసింహా నందమూరి బాలకృష్ణ బిగ్ బాస్ 7 కి హోస్టింగ్ చేస్తారని కథనాలొచ్చాయి. బాలయ్య ఓ వైపు వరుస సినిమాల్లో నటిస్తూనే బిగ్ బాస్ కోసం సమయం కేటాయించే వీలుందని ఊహాగానాలు సాగాయి. ఆహా టీఆర్పీని అన్ స్టాపబుల్ గా పరుగులు పెట్టిస్తున్న బాలయ్య వస్తే.. తిరిగి బిగ్ బాస్ హౌస్ పై జనాల్లో మరింత ఇంట్రస్ట్ క్రియేట్ అవుతుందని భావిస్తున్నారట. బాలయ్యను కాంటాక్ట్ చేస్తే.. బిగ్ బాస్ 7 కి హోస్ట్ గా చేసేందుకు ఓకే చెప్పారని.. ఇందుకోసం ఆయనకు భారీ రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు స్టార్ మా యాజమాన్యం ముందుకు వచ్చిందని వార్తలు వచ్చాయి.

అయితే… బిగ్ బాస్ 1 కి హోస్ట్ గా చేసిన ఎన్టీఆర్ నే మళ్ళీ రంగంలోకి  దింపితే బాగుంటుందని స్టార్ మా యాజమాన్యం ఆలోచిస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఎట్టి పరిస్థితిలో ఎన్టీఆర్ ని తీసుకురావాలనుకుంటున్నారని.. షోకి ఎనర్జీతో పాటు కొత్త రూపాన్ని తీసుకురావాలి అనే ప్లాన్ లో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ఎన్టీఆర్ ఓకే చెబితే భారీ ప్యాకేజీని ముట్ట జెప్పేందుకు స్టార్ – మా సిద్ధంగా ఉన్నట్టు కథనాలొస్తున్నాయి. దీంతో.. బిగ్ బాస్ 7 కి హోస్ట్ గా అబ్బాయ్ ఎన్టీఆర్ వస్తాడా? బాబాయ్ బాలకృష్ణ వస్తాడా..? అనేది ఆసక్తిగా మారింది. క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read : నాగ్ ప్లేస్ లో బాలయ్య? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్