ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీలో కొమరం భీమ్ గా నట విశ్వరూపం చూపించారు. దీంతో నార్త్ లో ఎన్టీఆర్ కు బాగా క్రేజ్ పెరిగింది. ఇంకా చెప్పాలంటే.. మన దేశంలోనే కాదు.. విదేశాల్లో సైతం ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. దీంతో తనకున్న క్రేజ్ కు తగ్గట్టుగా సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. నెక్ట్స్ మూవీని కొరటాల శివతో చేయనున్నారు. ఇది ‘ఎన్టీఆర్ 30వ’ చిత్రం. ఆతర్వాత ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనున్నారు. ఈ రెండు సినిమాల పై భారీ అంచనాలు ఉన్నాయి.

కొరటాల శివ, ప్రశాంత్ నీల్ తో చేయనున్న సినిమాల తర్వాత ఎన్టీఆర్ ఎవరితో సినిమా చేయనున్నారనేది ప్రకటించలేదు కానీ కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ తో సినిమా చేయనున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఇటీవల ధనుష్ తో వెట్రిమారన్ అసురన్ వంటి భారీ యక్షన్ మూవీ తెరకెక్కించారు. ఈ సినిమా కోలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇదే సినిమాను తెలుగులో వెంకటేష్ ‘నారప్ప’ టైటిల్ తో రీమేక్ చేశారు. ఇక్కడ కూడా సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం వెట్రిమారన్ ప్రస్తుతం విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్ లతో విడుతలై అనే సినిమా చేస్తున్నారు.

అలాగే సూర్యతో ‘వాడివాసల్’ మూవీ కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాల తర్వాత టాలీవుడ్ ఎన్టీఆర్ తో ఆయన ఒక మూవీ చేయాన్నారని అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ లో టాక్ బలంగా వినిపిస్తోంది. మరొక ఇంట్రస్టింగ్ విషయం ఏమిటంటే.. ఎన్టీఆర్ వెట్రి మారన్ ల మూవీ రెండు భాగాలుగా తెరకెక్కనుందట. మొదటి భాగంలో ఎన్టీఆర్, అలానే రెండవ భాగంలో ధనుష్ హీరోలుగా నటిస్తారట. ప్రస్తుతం ఆ మూవీకి సంబంధించి కథా చర్చలు జరుగుతున్నాయని, అలానే త్వరలోనే ఈ మూవీ పై అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ కూడా రానుందని ప్రచారం జరుగుతుంది. అయితే.. ప్రచారంలో ఉన్న ఈ వార్త వాస్తవమేనా..? కాదా..? అనేది తెలియాల్సివుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *