Sunday, January 19, 2025
Homeసినిమాఆ వార్త‌ల్లో వాస్త‌వం లేద‌ట‌!

ఆ వార్త‌ల్లో వాస్త‌వం లేద‌ట‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ – కొర‌టాల శివ‌  సినిమాని ఎప్పుడో అనౌన్స్ చేశారు కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు సెట్స్ పైకి వెళ్ల‌లేదు. ‘ఆచార్య’ అట్ట‌ర్ ఫ్లాప్ అవ్వ‌డంతో కొర‌టాల టెన్ష‌న్ లో ఉన్నార‌ని.. అందుచేత ఈ మూవీ స్టార్ట్ కావ‌డానికి టైమ్ ప‌డుతుంది అని వార్త‌లు వ‌చ్చాయి. ఆత‌ర్వాత ఎన్టీఆర్.. కొర‌టాల‌ను మ‌రోసారి క‌థ పై వ‌ర్క్ చేయ‌మ‌న్నారు. దీంతో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌డం మ‌రింత ఆల‌స్యం అయ్యింది.

ఇక తాజాగా ఎన్టీఆర్ ఆరోగ్యం బాలేద‌ని.. డాక్ట‌ర్లు నాలుగు వారాలు విశ్రాంతి తీసుకోమ‌న్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అందుచేత కొర‌టాల శివ‌తో చేయ‌నున్న మూవీ న‌వంబ‌ర్ వ‌ర‌కు స్టార్ట్ కాద‌ని టాక్ వినిపించింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ప్ర‌చారంలో ఉన్న వార్త‌లు అవాస్త‌వం అట‌. ఎన్టీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నార‌ని.. ఆయ‌న‌కు ఎలాంటి విశ్రాంతి అవ‌స‌రం లేద‌ని తెలిసింది. ఎన్టీఆర్ వ‌ల‌న కొర‌టాల శివ‌తో చేయాల్సిన సినిమా వాయిదా ప‌డ‌లేద‌ట‌.

ఎన్టీఆర్ ప్ర‌స్తుతం మేకోవ‌ర్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నార‌ట‌. కొర‌టాల ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ లో ఫుల్ బిజీగా ఉన్నార‌ట‌. ఈ మూవీతో పాటు బుచ్చిబాబు సానాతో చేయాల‌నుకున్న మూవీని కూడా ఓకేసారి స్టార్ట్ చేయాల‌ని ఎన్టీఆర్ అనుకుంటున్నాడ‌ని తెలిసింది. కొర‌టాల మూవీని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ  వ‌చ్చే స‌మ్మ‌ర్ కి రిలీజ్ చేయాల‌నేది ప్లాన్ అని టాక్. మ‌రి.. ఎప్పుడు స్టార్ట్ చేస్తారో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read : టెన్ష‌న్ లో కొర‌టాల‌, ఇంత‌కీ ఏమైంది? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్