Friday, March 29, 2024
Homeసినిమాటెన్ష‌న్ లో కొర‌టాల‌, ఇంత‌కీ ఏమైంది?

టెన్ష‌న్ లో కొర‌టాల‌, ఇంత‌కీ ఏమైంది?

Koratala Siva : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ త‌ర్వాత కొర‌టాల శివ‌తో చేయ‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. అయితే.. కొర‌టాల ఇటీవ‌ల ఆచార్య సినిమాని తెర‌కెక్కించారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల క్రేజీ కాంబినేష‌న్లో తెర‌కెక్కిన ఆచార్య చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బొల్తాప‌డింది. ఇది అంద‌రికీ షాకే. ఆచార్య డిజాష్ట‌ర్ అవ్వ‌డంతో.. కొర‌టాల నెక్ట్స్ మూవీ ఎన్టీఆర్ తో ఉంటుందా..? ఉండ‌దా..? అనే అనుమానాలు మొద‌ల‌య్యాయి.

అయితే.. ఎన్టీఆర్ మాత్రం ఇచ్చిన మాట ప్ర‌కారం కొర‌టాల‌తో సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. కాక‌పోతే క‌థ పై మ‌ళ్లీ వ‌ర్క్ చేయ‌నున్నారు. ఎన్టీఆర్ అలా చెప్ప‌డంతో క‌థ పై క‌స‌ర‌త్తు చేస్తూనే ఉన్నారు కొర‌టాల‌. ఈపాటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాలి కానీ.. ఎన్టీఆర్ కంగారు ఏమీ లేదు. క‌థ ప‌క్క‌గా సెట్ అయిన త‌ర్వాతే షూటింగ్ స్టార్ట్ చేద్దామ‌ని చెప్పార‌ట‌. ఆగ‌ష్టు లేదా సెప్టెంబ‌ర్ నుంచి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నారు అని వార్త‌లు వ‌స్తున్నాయి.

కొర‌టాల మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో క‌థ‌ను రెడీ చేయ‌లేద‌ట‌. మార్పులు చెర్పులు చేస్తూనే ఉన్నాడ‌ట‌. ఈసారి ఖ‌చ్చితంగా స‌క్సెస్ సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో క‌థ‌ను రెడీ చేస్తున్నార‌ట‌. ఇంకా చెప్పాలంటే.. కొర‌టాల ఇప్పుడు టెన్ష‌న్ లో ఉన్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఎన్టీఆర్ కు కొర‌టాల క‌థ‌ను చెప్ప‌నున్నార‌ని స‌మాచారం. అయితే.. అంద‌రికీ క‌నెక్ట్ అయ్యేలా కొర‌టాల క‌థ‌ను రెడీ చేస్తార‌ని ఎన్టీఆర్.. పూర్తి న‌మ్మ‌కంతో ఉన్నార‌ని తెలిసింది. మ‌రి.. ఎన్టీఆర్ మెచ్చేలా క‌థను రెడీ చేసి..కొర‌టాల‌ త్వ‌ర‌లోనే షూటింగ్ స్టార్ట్ చేస్తారేమో చూడాలి.

Also Readఎన్టీఆర్ స‌ల‌హాను కొర‌టాల పాటిస్తారా..? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్