Monday, May 20, 2024
Homeసినిమాబుచ్చిబాబుకు ఎన్టీఆర్ షాక్ ఇచ్చారా.?

బుచ్చిబాబుకు ఎన్టీఆర్ షాక్ ఇచ్చారా.?

Waiting List:  యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ త‌ర్వాత చేసే సినిమాల గురించి గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. కొర‌టాల శివ‌తో ఓ భారీ చిత్రం, అలాగే కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ఓ భారీ చిత్రం చేయ‌నున్నార‌ని టాక్ వినిపించింది. అయితే.. ఈ రెండు సినిమాల‌తో పాటు ‘ఉప్పెన’తో సంచ‌ల‌నం సృష్టించిన యంగ్ డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానాతో కూడా ఎన్టీఆర్ సినిమా చేయ‌నున్న‌ట్టుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

బుచ్చిబాబుకు ఎన్ని ఆఫ‌ర్స్ వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ఎన్టీఆర్ తోనే సినిమా చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో మ‌రో సినిమా చేయ‌లేదు. అప్ప‌టి నుంచి ఎన్టీఆర్ తో చేయ‌నున్న క‌థ పైనే క‌స‌ర‌త్తు చేస్తున్నాడు. అయితే.. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ కు పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ పెరిగింది. అందుచేత బుచ్చిబాబుతో సినిమాకి ఓకే చెబుతాడా..?  లేదా..? అనేది ఆస‌క్తిగా మారింది.

అయితే.. ఇప్పుడు అనుకున్న‌ట్టుగానే అయ్యిందని.. బుచ్చిబాబుకు ఎన్టీఆర్ షాక్ ఇచ్చార‌ని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇంత‌కీ మేట‌ర్ ఏంటంటే.. నెక్ట్స్ మూవీని కొర‌టాల శివ‌తోను ఆ త‌ర్వాత సినిమా ప్ర‌శాంత్ నీల్ తోనూ చేసేందుకు ఓకే చెప్పార‌ట కానీ.. బుచ్చిబాబుతో సినిమాను పెండింగ్లో పెట్టార‌ని తెలిసింది. ఈ పుట్టిన‌రోజుకు కొర‌టాల శివ‌, ప్ర‌శాంత్ నీల్ తో చేసే సినిమాల గురించి ప్ర‌క‌టించ‌నున్నార‌ని స‌మాచారం. మ‌రి.. ఇదే క‌నుక నిజ‌మైతే.. బుచ్చిబాబు ఇంకా ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తారో..?  లేక వేరే హీరోతో సినిమా చేస్తారో చూడాలి.

Also Read : ఎన్టీఆర్ బ‌ర్త్ డే.. మూడు స‌ర్ ఫ్రైజ్ లు…

RELATED ARTICLES

Most Popular

న్యూస్