Monday, June 15, 2026
HomeసినిమాNTR: 'వార్ 2' కోసం ఎన్టీఆర్ భారీ రెమ్యూనరేషన్?

NTR: ‘వార్ 2’ కోసం ఎన్టీఆర్ భారీ రెమ్యూనరేషన్?

‘ఆర్ఆర్ఆర్’లో కొమరం భీమ్ పాత్ర పోషించి మెప్పించారు యంగ్ టైగర్ ఎన్టీఆర్.  ఈ సినిమా తర్వాత  గ్లోబల్ స్టార్ అయ్యారు. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో సినిమా చేస్తున్నారు. శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.

అయితే.. ఎన్టీఆర్ ఎవరూ ఊహించని విధంగా బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్ 2’లో నటించడానికి ఓకే చెప్పడం పెద్ద సర్ ఫ్రైజ్.  ‘బ్రహ్మస్త్ర’ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ ఎంత అనేది ఆసక్తిగా మారింది.

ఎన్టీఆర్ కు 100 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నారని ఒక వార్త బైటకు రాగా, కాదు 30 కోట్లు మాత్రమేననే ప్రచారం వినబడుతోంది. ఒక వేళ 30 కోట్లు మాత్రమే అయితే  ఎన్టీఆర్ క్యారెక్టర్ తక్కువ క్యారెక్టర్ ఉంటుందా..? అనే ప్రశ్న కూడా మొదలైంది. మొత్తానికి ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఇయర్ ఎండింగ్ లో సినిమాను సెట్స్ పైకి తీసుకురానున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular