Saturday, March 14, 2026
HomeసినిమాNTR: అభిమానులే నా డ్రైవింగ్ ఫోర్స్: ఎన్టీఅర్ భావోద్వేగ ట్వీట్

NTR: అభిమానులే నా డ్రైవింగ్ ఫోర్స్: ఎన్టీఅర్ భావోద్వేగ ట్వీట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాకు ‘దేవర’ అనే టైటిల్ ఖరారు చేసి నిన్న మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ ను విడుదల చేశారు. ప్రేక్షకుల నుంచి ఈ పోస్టర్ కు విశేష స్పందన లభిస్తోంది. దీనిపై ఓ ప్రకటనను ఎన్టీఆర్ విడుదల చేశాడు.

“గత కొన్ని దశాబ్దాలుగా నా జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. అలాంటి సమయాల్లో నా అభిమానులే నాకు మద్దతుగా, మూల స్తంభంగా నిలిచారు. నేను పోషించిన ప్రతి పాత్ర, నా అభిమానుల కోసమే. నాకు అండగా నిలిచి నిలిచి, నేను చేసే ప్రతి కథను, ప్రతి పాత్రను ఆదరిస్తున్నందుకు, నిత్యం నాపై మీరు చూపిస్తున్న ప్రేమకు.. విధేయతకు ప్రతి అభిమానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఇస్తున్న చోదక శక్తి (డ్రైవింగ్ ఫోర్సు) నన్ను ముందుకు నడిపిస్తోంది.

ఇక #దేవర పోస్టర్ కు మీరిచ్చిన స్పందన అద్భుతమైనది. దానికి మీకెప్పుడు కృతజ్ఞుడను. అది నా పుట్టినరోజును మరింత స్పెషల్ గా చేసింది. ఈ రోజును మరింత ప్రత్యేకంగా మార్చినందుకు నా స్నేహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు మరియు తోటి సినీ సహోదర సభ్యులకు నేను ధన్యవాదాలు” అంటూ ట్విట్టర్ లో స్పందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular