మహారాష్ట్ర ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకునేందుకు సన్నద్దమైంది. స్థానిక సంస్థలలో OBC రిజర్వేషన్ అమలు కోసం ప్రణాలికలు సిద్దం చేసింది. ముఖ్యమంత్రి ఉద్దావ్ థాకరే నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం శుక్రవారం జరిగింది. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, మాజీ ముఖ్యమంత్రి, అసెంబ్లీలో విపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్, ప్రవీణ్ దరేకర్, అశోక్ చవాన్, నన పతోలె, చగన్ భుజభల్, ఏకనాథ్ షిండే, జయంత్ పాటిల్ తదితర సీనియర్ నేతలు హాజరయ్యారు. స్థానిక సంస్థలలో OBC రిజర్వేషన్ కు అఖిల పక్ష సమావేశంలో అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. OBC జనాభా వివరాలు వచ్చే వరకు ఎన్నికలు నిర్వహించకూడదని అల్ పార్టీ మీటింగ్ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది.
స్థానిక సంస్థలలో OBC రిజర్వేషన్ విధానానికి బిజెపి కట్టుబడి ఉందని, వెనుకబడిన తరగతుల కమీషన్ నివేదిక వచ్చే వరకు ఎన్నికల నిర్వహణ చేపట్టవద్దని ప్రభుత్వానికి మరోసారి స్పష్టం చేసినట్టు ఫడ్నవీస్ తెలిపారు. రిజర్వేషన్ అమలు కోసం కేంద్రం వద్ద వివరాలు తీసుకుంటామని, రాష్ట్రం తరపున కూడా వివరాలు సేకరించి రెండు, మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి చగన్ భుజ్భాల్ వెల్లడించారు. ఎన్నికలు ఎక్కువ కాలం వాయిదా వేసే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టత ఇచ్చారు.
సుప్రీమ్ కోర్ట్ నిభంధనలకు లోబడి స్థానిక సంస్థలలో OBC రిజర్వేషన్ అమలు చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం అఖిల సమావేశంలో ప్రకటించింది. శివసేన-కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై అన్ని పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి. మరో ఆరు నెలల్లో జరిగే ఎన్నికల్లో మున్సిపల్ కార్పోరేషన్స్, పురపాలక సంఘాలు, జిల్లా పరిషద్, గ్రామ పంచాయతీలు తదితర సంస్థలలో దామాష ప్రకారం OBC లకు పదవులు దక్కనున్నాయి.