Friday, November 22, 2024
Homeస్పోర్ట్స్Obed McCoy: రెండో మ్యాచ్ లో విండీస్ విజయం

Obed McCoy: రెండో మ్యాచ్ లో విండీస్ విజయం

ఐదు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇండియా-వెస్టిండీస్  మధ్య జరిగిన రెండో టి 20లో విండీస్ 5వికెట్ల తేడాతో విజయం సాధించింది.  విండీస్ బౌలర్  ఒబేద్  మెక్ రాయ్ ఆరు వికెట్లతో రాణించి ఇండియా బ్యాటింగ్ లైనప్ ను తుత్తునియలు చేశాడు,  దీనితో ఇండియా 138 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తరువాత ఓపెనర్ బ్రాండన్ కింగ్ 68 పరుగులతో (52 బంతులు, 8 ఫోర్లు, 2 సిక్సర్లు)  రాణించడంతో 19.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి  లక్ష్యాన్ని ఛేదించింది.

సెయింట్ కిట్స్ లోని వార్నర్ పార్క్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో విండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ తొలి బంతికే కెప్టెన్ రోహిత్ డకౌట్ గా వెనుదిరిగాడు.  జట్టులో హార్దిక్ పాండ్యా  ఒక్కడే 34 పరుగులతో అత్యధిక  స్కోరర్ గా నిలిచాడు. రవీంద్ర జడేజా-27; రిషభ్ పంత్-24 పరుగులతో  రాణించాడు. 19.4  ఓవర్లలో 138 పరుగులకే ఇండియా ఆలౌట్ అయ్యింది.

విండీస్ బౌలర్లలో మెక్ రాయ్ 6, హోల్డర్ 2 , అల్జారీ జోసెఫ్, అకీల్ హోసేన్ చెరో వికెట్ పడగొట్టారు.

ఆ తర్వాతా బ్యాటింగ్ దిగిన విండీస్ మొదటి వికెట్ కు 46 పరుగులు చేసింది. ఓపెనర్ కేల్ మేయర్స్(8),  నికోలస్ పోరన్(14),  హెట్మెయిర్(6) తక్కువ స్కోరుకే ఔటయినా… డివాన్ థామస్ 19 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 31 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో విజయం విండీస్ ను వరించింది.

ఇండియా బౌలర్లలో ఆర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, హార్దిక్ పాండ్యా, ఆవేష్ ఖాన్ తలా ఒక వికెట్ పడగొట్టారు

ఆరు వికెట్లతో రాణించిన ఒబేద్ మెక్ రాయ్ కే ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.

Also Read : పాక్ పై ఇండియా ఘన విజయం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్