వరల్డ్ కప్ క్రికెట్ లో ఇండియా తొలి మ్యాచ్ లో శుభారంభం చేసింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఇచ్చిన 200 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా కూడా 2 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ లు డకౌట్ గా వెనుదిరిగారు. ఈ దశలో విరాట్ కోహ్లీ- కెఎల్ రాహుల్ లు 165 పరుగుల భాగస్వామ్యంతో రాణించి జట్టును విజయ తీరాలకు నడిపించారు. హాజెల్ వుడ్ 3; స్టార్క్ ఒక వికెట్ పడగొట్టారు.
కోహ్లీ బంతుల్లో ఫోర్లతో పరుగులు చేసి ఔట్ కాగా, కెఎల్ రాహుల్ 115 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 97; హార్దిక్ పాండ్యా 11 రన్స్ తో నాటౌట్ గా నిలిచారు. అంతకుముందు ఆసీస్ 5 పరుగుల వద్ద మిచెల్ మార్ష్ (డకౌట్) కోల్పోయింది. స్టీవ్ స్మిత్-46; డేవిడ్ వార్నర్-41; స్టార్క్-28; లబుషేన్-21 పరుగులు చేయడంతో ఆసీస్ 199 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది. రవీంద్ర జడేజా 3; బుమ్రా, కుల్దీప్ యాదవ్ చెరో రెండు; సిరాజ్, హార్దిక్ పాండ్యా, అశ్విన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
కెఎల్ రాహూల్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.