Monday, January 20, 2025
Homeస్పోర్ట్స్Hockey World Cup: సిఎం లకు ఆహ్వానం

Hockey World Cup: సిఎం లకు ఆహ్వానం

జనవరి 13 నుంచి 29 వరకూ ఓడిశాలో పురుషుల వరల్డ్ కప్ హాకీ 2023 జరుగుతోన్న సంగతి తెలిసిందే. రాజధాని భువనేశ్వర్ లోని కళింగ స్టేడియంతో పాటు రూర్కెలా లోని బిర్సా ముందా అంతర్జాతీయ హాకీ స్టేడియంలో ఈ పోటీలు జరగనున్నాయి.  ఫెడరేషన్ అఫ్ ఇంటర్నేషనల్ హాకీ (ఎఫ్ ఐ హెచ్), హాకీ ఇండియా లతో కలిసి ఒడిశా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పోటీలను నిర్వహిస్తోంది.

కాగా, ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఈ పోటీలకు సాదరంగా ఆహ్వానం పలికారు. తన మంత్రి వర్గ సహచరులను స్వయంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల వద్దకు పంపి వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వాన పత్రం అందజేశారు.

ఆహ్వాన పత్రంతో పాటు,  ఓ మెమెంటో, హాకీ ఇండియా టీమ్ ధరించే జేర్సీలను ముఖ్యమంత్రులకు అందించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్