Sunday, June 7, 2026
HomeTrending NewsHousing for all: అందరికీ ఇళ్లు ప్రభుత్వ లక్ష్యం: జగన్

Housing for all: అందరికీ ఇళ్లు ప్రభుత్వ లక్ష్యం: జగన్

Review: ఇళ్ల నిర్మాణం అనుకున్న సమయాని పూర్తికావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆప్షన్‌-3 ఎంపిక చేసుకున్న లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణంపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. లే అవుట్ల వారీగా ప్రాధాన్యత పరంగా పనులను గుర్తించి.. అనుకున్న సమయానికి పని పూర్తయ్యేలా చూడాలని సూచించారు. ఇళ్ల నిర్మాణం నాణ్యతలో ఎలాంటి రాజీ వద్దని, ప్రతి దశలోనూ నాణ్యతా నిర్ధారణ పరీక్షలు జరగాలని దిశా నిర్దేశం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో  గృహ నిర్మాణంపై జగన్‌ సమగ్ర సమీక్ష నిర్వహించారు.

సమీక్ష సందర్భంగా సిఎం చేసిన వ్యాఖ్యలు…

ఇళ్లులేని వారికి అందరికీ ఇళ్లు ఇవ్వడమే ప్రభుత్వ ఉద్దేశం

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ. 5,655 కోట్లు ఖర్చు.

ఇళ్ల నిర్మాణంపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలి

లే అవుట్లలో పర్యటన వల్ల ఇళ్ల నిర్మాణ ప్రగతిపై సమీక్షించి ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

అవుట్లను సందర్శించినట్టుగా ఫొటోలను కూడా అప్‌లోడ్‌ చేయాలి

ఇళ్ల నిర్మాణంలో క్వాలిటీని నిరంతరం పాటించడానికి ఎస్‌ఓపీలను అందుబాటులో ఉంచాలి

గ్రామ సచివాలయాల్లో ఉన్న ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ సేవలను విస్తృతంగా వాడుకోవాలి

ఇళ్ల నిర్మాణంలో క్వాలిటీ ప్రమాణాలు పాటించే విషయంలో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ భాగస్వామ్యం తీసుకోవాలి

ఇళ్లు పూర్తయ్యే సరికి మూడు రకాల మౌలిక సదుపాయాలు ఉండాలి

విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలి.

మిగిలిన మౌలిక సదుపాయాలనూ వృద్ధిచేసుకుంటూ ముందుకు సాగాలి అంటూ అధికారులకు సూచలు ఇచ్చారు.

ఈ పనులకు సంబంధించి ఇప్పటికే డీపీఆర్‌లు సిద్ధం అయ్యాయని, ప్రాధాన్యతాక్రమంలో చేసుకుంటూ వెళ్తున్నామని అధికారులు సిఎం కు వివరణ ఇచ్చారు. ప్రతి శనివారం హౌసింగ్‌డేగా నిర్వహిస్తున్నామని, ఆ రోజు తప్పనిసరిగా అధికారులు లే అవుట్లను సందర్శిస్తున్నారని తెలిపారు.

సమీక్షా సమావేశంలో గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, ఇంధనశాఖ స్పెషల్‌ సీఎస్‌ కె విజయానంద్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్‌ శ్రీధర్, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ కార్యదర్శి ఇంతియాజ్, గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి రాహుల్‌ పాండే ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read : No Chance: మోసం చేసేవారికి మరో ఛాన్స్ వద్దు: సిఎం జగన్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular