Friday, September 20, 2024
Homeస్పోర్ట్స్ICC WC Qualifiers: ఐర్లాండ్ కు ఒమన్ షాక్

ICC WC Qualifiers: ఐర్లాండ్ కు ఒమన్ షాక్

ఐసిసి వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ 2023లో నేడు జరిగిన రెండో మ్యాచ్ లో ఐర్లాండ్ పై ఒమన్ 5 వికెట్లతో  గెలుపొందింది. బులావాయో అథ్లెటిక్ క్లబ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ఒమన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఐర్లాండ్ ఆటగాళ్ళు డాక్రెల్-91; హ్యారీ టెక్టార్-52 పరుగులతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. ఒమన్ బౌలర్లలో బిలాల్ ఖాన్, ఫయ్యజ్ భట్ చెరో రెండు; జీషన్ మషూక్, అయాన్ ఖాన్, ఒడేద్రా తలా ఒక వికెట్ సాధించారు.

ఒమన్ 9 పరుగులకే తొలి వికెట్ (జితేందర్ సింగ్-1) కోల్పోయినా రెండో వికెట్ కు కాశ్యప్ ప్రజాపతి- అఖిబ్ ఇలియాస్ లు 94 పరుగులు జోడించారు. ప్రజాపతి-72; ఇలియాస్-52; కెప్టెన్ జీషన్ మాసూఖ్-59; మొహమ్మద్ నదీమ్-46 (నాటౌట్) రాణించడంతో 48.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసి విజయం అందుకుంది.

ఐర్లాండ్ బౌలర్లలో జోషువా లిటిల్, మార్క్ అడైర్ చెరో రెండు; జార్జ్ డాక్రెల్ ఒక వికెట్ పడగొట్టారు.

ఒమన్ కెప్టెన్ జీషన్ మషూఖ్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్