Omicron Antidote To Corona :
ఓమిక్రాన్ సోకితే తొంబై శాతం మందికి అసలు లక్షణాలు వుండవు. మిగతా వారికి స్వల్ప లక్షణాలు. పోస్ట్ ఓమిక్రాన్ – అంటే సోకిన తరువాత ఎలాంటి సమస్యలు వుండవు. దీనికి తోడు ఓమిక్రాన్ సోకితే వచ్చే వ్యాధి నిరోధకత డెల్టా లాంటి బలమైన కోవిద్ వేరియంట్ రాకుండా కాపాడుతుంది. ఆ విధంగా కొన్ని రోజులకు డెల్టా లాంటి సమస్యాత్మక వేరియంట్ లు తుడిచిపెట్టుకొని పోతాయి. పెద్దగా సమస్య లేని ఓమిక్రాన్ అలాగే ఉండి పోతుంది. అంటే కరోనాకు ఓమిక్రాన్ విరుగుడు అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదని వైద్య రంగ నిపుణులు తేల్చి చెపుతున్నారు.
కరోనా పాండెమిక్ దశ ముగిసింది. ఓమిక్రాన్ రూపంలో అది ఎండెమిక్ అయిపొయింది. అంటే జలుబు లా సోకుతూ ఉంటుంది. సమస్యలు సృష్టించదు. వైద్య నిపుణులు, వైద్య రంగ మేధావులు ఈ విషయాన్ని దాదాపు నెల రోజుల క్రితమే చెప్పారు. ఇంకా సైంటిఫిక్ నిర్ధారణ కాలేదు అని అప్పుడు అన్నవారికి ఇదిగో దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తల పరిశోధనా డేటా వివరాలు పరిశీలిస్తే అర్థం అవుతుంది.
Also Read : ఢిల్లీలో కరోనా ఆంక్షలు