Tuesday, March 19, 2024
HomeTrending NewsBC Welfare: కులవృత్తులు, చేతివృత్తుల వారికి లక్ష సాయం

BC Welfare: కులవృత్తులు, చేతివృత్తుల వారికి లక్ష సాయం

బీసీ కులవృత్తులు నిర్వహించుకునే చేతివృత్తిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది, లక్షరూపాయల ఆర్థిక సహాయానికి సంబందించిన విధివిధానాలతో పాటు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి నేటినుండి అవకాశం ఇస్తున్నామని, తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో బాగంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మంచిర్యాలలో లాంఛనంగా ప్రారంభిస్తున్నామన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. ఈరోజు హైదరాబాద్లోని డా.బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో వెబ్సైట్ని లాంచ్ చేసారు.
ఈనెల 6 నుండి 20తేదీ వరకూ https://tsobmmsbc.cgg.gov.in వెబ్సైట్లో అప్లై చేసుకోవాలన్నారు, ఫోటో, ఆధార్, కుల ద్రువీకరణ పత్రం తదితర వివరాలతో సరళంగా అప్లికేషన్ ఫారంను రూపొందించామన్న మంత్రి వచ్చిన ధరఖాస్తులను జిల్లా యంత్రాంగంతో పరిశీలన జరిపి లబ్దీదారులను ఎంపిక చేస్తామన్నారు. చేతివ్రుత్తిదారుల జీవితాలలో వెలుగులు నింపి, వారి ఆర్థిక భరోసాను అందించడంతో పాటు గౌరవప్రదమైన జీవనం కొనసాగించేందుకు సీఎం కేసీఆర్ నిరంతరం తపన పడుతుంటారని, ఈ పథకం ద్వారా వారి జీవితాల్లో ఆర్థిక స్వావలంబనకు అవకాశం ఏర్పడుతుందన్నారు. లబ్దీదారులు వ్రుత్తి పనిముట్లు, ముడిసరుకు కొనడానికి ఈ నిధులు ఉపయోగపడుతాయని, దీని ద్వారా లబ్దీదారులు ఆర్థిక స్వావలంబన సాదించడంలో అధికార యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తుందన్నారు.

గత కేబినేట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు మంత్రి గంగుల కమలాకర్ ఆధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ వెనుకబడిన వర్గాల కులవృత్తిదారులకు లక్ష ఆర్థిక సహాయం విధివిదానాలను వేగంగా ఖరారు చేసి దశాబ్ది ఉత్సవాల్లోనే అందించడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం.

ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ కార్పోరేషన్ ఎండీ మల్లయ్య బట్టు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్