Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్యాషెస్ సిరీస్ రెండో టెస్ట్: వార్నర్ మళ్ళీ మిస్

యాషెస్ సిరీస్ రెండో టెస్ట్: వార్నర్ మళ్ళీ మిస్

Adelaide Test :
ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ రెండో టెస్ట్ లోనూ డేవిడ్ వార్నర్ సెంచరీ మిస్ అయ్యాడు. తొలి టెస్ట్ లో మొదటి ఇన్నింగ్స్ లో 95 పరుగుల వద్ద ఔటై సెంచరీ మిస్ చేస్తుకున్న వార్నర్ ఈసారి కూడా అదే స్కోరు వద్ద ఔటే పెవిలియన్ చేరాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 2 వికెట్ల నష్టానికి 221  పరుగులు చేసింది.  ఆస్ట్రేలియాలోని అడిలైడ్ లో నేడు రెండో టెస్ట్ మొదలైంది. డే నైట్ పద్ధతిలో జరుగుతోన్న ఈ టెస్టులో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

ఆస్ట్రేలియా జట్టులో రెండు మార్పులు జరిగాయి. కోవిడ్ సోకిన వ్యక్తితో దగ్గరగా మెలిగిన అనుమానంతో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. అతని స్థానంలో స్టీవ్ స్మిత్ సారధ్యం వహించాడు.  కమ్మిన్స్ స్థానంలో బౌలర్ గా మైఖేల్ నేసేల్ జట్టులో చేరాడు. హాజెల్ వుడ్ స్థానంలో జే రిచర్డ్సన్  జట్టులోకి వచ్చాడు.  ఇంగ్లాండ్ జట్టులో మార్క్ వుడ్, జాక్ లీచ్ స్థానంలో జేమ్స్ అండర్సన్, స్టువార్ట్ బ్రాడ్  జట్టులో చేరారు.

ఆసీస్ ఇన్నింగ్స్ లో జట్టు స్కోరు నాలుగు వద్ద ఓపెనర్ మార్కస్ హారిస్ (3) ఔటయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ వార్నర్, మార్నస్ లాబుస్ చేంజ్ లు రెండో వికెట్ కు 172 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి లాబుస్ చేంజ్-95; స్టీవ్ స్మిత్-18 పరుగులతోను క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రాడ్, బెన్ స్టోక్స్ చెరో వికెట్ పడగొట్టారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్