Saturday, January 18, 2025
Homeసినిమామ‌హేష్ తో మూవీపై నాగార్జున‌ క్లారిటీ

మ‌హేష్ తో మూవీపై నాగార్జున‌ క్లారిటీ

టాలీవుడ్ కింగ్ నాగార్జున న‌టించిన‌ లేటెస్ట్ మూవీ ‘ది ఘోస్ట్‘. ఈ చిత్రానికి ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ మూవీ టీజ‌ర్ అండ్ ట్రైల‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో మూవీ పై అంచ‌నాలు అమాంతం పెరిగాయి. ద‌స‌రా కానుక‌గా ది ఘోస్ట్ మూవీని అక్టోబ‌ర్ 5న విడుదల చేస్తున్నారు. అభిమానుల స‌మ‌క్షంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కర్నూలులో గ్రాండ్ గా నిర్వ‌హించారు.

అయితే.. ఈ మూవీ ట్రైల‌ర్ ను సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు రిలీజ్ చేశారు. అప్పుడు నాగార్జున ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ.. కృష్ణ గారితో ‘వారసుడు’ చిత్రానికి కలిసి పని చేశాను. మ‌న‌మేందుకు క‌లిసి న‌టించ‌కూడ‌దు మ‌హేష్.. అని అడిగారు. ఈ ట్వీట్ అప్పట్లో ట్విట్టర్‌లో సంచలనం రేపింది. ఇక‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాగార్జునను ఇదే ప్రశ్న వేశారు. నాగార్జున స్పందిస్తూ.. మహేష్‌తో కలిసి పని చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నానని అన్నారు.

అంతే కాకుండా.. మహేష్ ఎప్పుడంటే అప్పుడు సినిమా చేయ‌డానికి రెడీ అన్నారు నాగార్జున‌. ది ఘోస్ట్ ప్రీ రిలీజ్ వేడుక‌లో  అక్కినేని నాగార్జున చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నాగార్జున‌, మ‌హేష్ కాంబోలో మూవీ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. మ‌రి.. ఈ క్రేజీ కాంబోలో మూవీని ఎవ‌రు తెర‌కెక్కిస్తారో..?  ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.

Also Read : ‘ది ఘోస్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చైతన్య, అఖిల్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్