Friday, April 19, 2024
Homeసినిమా'ది ఘోస్ట్'కు యూ/ఎ సర్టిఫికేట్

‘ది ఘోస్ట్’కు యూ/ఎ సర్టిఫికేట్

అక్కినేని నాగార్జున లేటెస్ట్ మూవీ ‘ది ఘోస్ట్’. క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ది ఘోస్ట్ ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో భారీ అంచనాలు పెంచింది. ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. సెన్సార్ బోర్డ్ సభ్యులు చిత్ర యూనిట్ పై ప్రశంసలు జల్లు కురిపించారు.

ఈ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ రేపు (సెప్టెంబర్ 25) కర్నూలులోని ఎస్టీబిసి గ్రౌండ్‌లో గ్రాండ్ గా జరగనుంది. ఓపెన్ గ్రౌండ్ లో జరగబోతున్న ఈ పబ్లిక్ ఈవెంట్ కి ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. టీమ్ మొత్తం ఈ వేడుకను ఘనంగా నిర్వహించనుంది. నాగ చైతన్య, అఖిల్ ఈ గ్రాండ్ ఈవెంట్ కి హాజరుకానున్నారు. చాలా కాలం తర్వాత తండ్రీ కొడుకులు నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలిసి సినిమా వేడుకకి రావడం అక్కినేని అభిమానులకు కన్నుల పండుగ కానుంది. ఈ చిత్రంలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్‌లు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్