ప్రభాస్ పెళ్లి ఎప్పుడు?… గత కొన్ని సంవత్సరాలుగా సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని పెదనాన్న కృష్ణంరాజు ప్రకటించారు. అయితే.. బాహుబలి 1, బాహుబలి 2 విడుదలైనా కానీ.. ప్రభాస్ మాత్రం పెళ్లి చేసుకోలేదు. ఆమధ్య ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. ఆతర్వాత అలాంటిది ఏమీ లేదు.. మేము మంచి ఫ్రెండ్స్ అని స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇక రీసెంట్ గా ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీలో నటించారు. ఇందులో ప్రభాస్ శ్రీరాముడు అయితే.. కృతి సనన్ సీతగా నటించింది.
వీరిద్దరూ లవ్ లో ఉన్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. ప్రచారంలోకి వచ్చిన ఈ వార్తల పై కృతి సనన్ క్లారిటీ ఇచ్చింది. ఈమె కూడా మేమిద్దరం మంచి ఫ్రెండ్స్, మా మధ్య అలాంటిది ఏమీ లేదని చెప్పింది. ఇదిలా ఉంటే.. ప్రభాస్ ఇటీవల ‘అన్ స్టాపబుల్’ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ టాక్ షోలో ప్రభాస్ ను పెళ్లి గురించి బాలకృష్ణ అడిగారు. ఎంతలా అడిగారంటే.. పెళ్లి చేసుకుంటావా..? లేదా? అంటూ కాస్త సరదాగా.. ఇంకాస్త గట్టిగానే అడిగారు. అందుకు ప్రభాస్ స్పందిస్తూ .. పెళ్లి చేసుకుంటాను సార్ .. రాసి పెట్టి ఉండాలి కదా అన్నాడు.
మీ అమ్మకి చెప్పిన మాటలు ఇక్కడ చెప్పకయ్యా. కొడుకు పెళ్లి చేసుకోవాలనీ .. కోడలితో కలిసి తిరుగుతూ ఉంటే చూడాలని ఆమెకి ఉంటుంది కదా అని బాలయ్య అన్నారు. ప్రస్తుతం మా సిస్టర్ మా అమ్మతోనే ఉంటుంది. మా వదినా వాళ్లు ఆ పక్కనే ఉంటారు. ఇప్పటి వరకూ అలా నడిచిపోతోంది అంటూ ప్రభాస్ చెప్పాడు. ఆ మధ్య శర్వానంద్ ఈ షోకి వచ్చినప్పుడు .. పెళ్లెప్పుడయ్యా అంటే, ప్రభాస్ చేసుకున్న తరువాత చేసుకుంటానని నీ పేరు చెప్పాడు అని బాలయ్య అన్నారు. దీనికి ప్రభాస్ స్పందిస్తూ .. అలా అయితే నేను సల్మాన్ ఖాన్ చేసుకున్న తరువాత చేసుకుంటానని చెప్పాలేమో అంటూ నవ్వేశాడు. మరి.. కొత్త సంవత్సరంలో అయినా ప్రభాస్ పెళ్లి వార్త చెబుతారేమో చూడాలి.
Also Read: ప్రభాస్ అన్ స్టాపబుల్ పై ఆహా అప్ డేట్