Sunday, June 14, 2026
Homeసినిమావీరమల్లుకు స్టంట్స్ కొరియోగ్రఫీ చేస్తున్న పవర్ స్టార్..?

వీరమల్లుకు స్టంట్స్ కొరియోగ్రఫీ చేస్తున్న పవర్ స్టార్..?

పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరి హర వీరమల్లు‘. ఈ చిత్రానికి విభిన్న కథా చిత్రాల దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఏఎం రత్నం ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ కు జంటగా నిధి అగర్వాల్ నటిస్తుంది. ఎప్పుడో ప్రారంభమైన వీరమల్లు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోవాలి కానీ.. కొన్ని కారణాల వలన ఆలస్యం అయ్యింది. ఇప్పుడు సాధ్యమైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాలని చాలా ఫాస్ట్ గా వర్క్ చేస్తున్నారు. రామోజీ ఫిలింసిటీలో పవన్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

ఈ షెడ్యూల్ ప్రారంభానికి ముందు నిర్వహించిన వర్క్  షాప్స్ లో సైతం పవన్ కళ్యాణ్‌ పాల్గొన్నారు. ఇదే సినిమా కోసం పవన్ కళ్యాణ్‌ స్టంట్ మాస్టర్ గానూ మారిపోయారా? యాక్షన్ సన్నివేశాల కోసం  విజయ్ తో కలిసి స్టంట్స్ కొరియోగ్రఫీ చేసారా? అంటే అవుననే టాక్ వినిపిస్తుంది. దాదాపు 20 ఏళ్ల క్రితం నాటి మార్షల్ ఆర్స్ట్ ని మళ్లీ పవర్ స్టార్ తెర పైకి తెచ్చినట్లు సమాచారం. మార్షల్ ఆర్స్ట్ విద్యలో పవన్ ఆరితేరాడు. ‘జానీ’ సినిమాకు పవన్ కళ్యాణే స్టంట్స్ కొరియోగ్రఫీ చేసాడు. ఇంకా అవసరమైన అన్ని సందర్భాల్లోనూ పవర్ స్టార్ సొంత క్రియేటివిటీ వాడిన సందర్భాలున్నాయి.

మళ్లీ ఇంత కాలానికి మార్షల్ ఆర్స్ట్ కోసం పవన్ రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి. హరి హర వీరమల్లు కొన్ని కీలక సన్నివేశాలకు పవన్ స్వయంగా యాక్షన్ సీన్స్ డిజైన్ చేసారట. ఇప్పటికే రిలీజ్ అయిన  పోస్టర్స్ లో మార్షల్ ఆర్స్ట్ ఫోజులో పీకే హైలైట్ అవుతున్నారు. దీంతో వీరమల్లు పై మరింత క్రేజ్ ఏర్పడింది. సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మరి.. వీరమల్లు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సెట్ చేస్తాడో చూడాలి.

Also Read: శరవేగంగా హరి హర వీరమల్లు చిత్రీకరణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular